Site icon Prime9

Bigg Boss Season 6: బిగ్ బాస్ షోలో మరి ఇంత తక్కువ రెమ్యునరేషన్ కూడా ఇస్తారా ?

adi reddi prime9news

adi reddi prime9news

Bigg Boss Season 6:  ప్రస్తుతం బుల్లితెర పై బిగ్ బాస్ కు ఉన్నా పాపులారీటి ఇంక ఏ షో కూడా లేదు. ఈ  బిగ్ బాస్ షో కేవలం తెలుగులోనే  కాకుండా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికి తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 4న ఈ షో ప్రారంబమయిన విషయం మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టి అక్కడ ఆట కూడా  మొదలైంది. మొదలైన తరువాత ఈ  షో మీద ట్రోల్స్ రాకుండా ఉంటాయా, వచ్చాయి. ప్రస్తుతం బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్ళిన  కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

బిగ్‏బాస్ ఇంట్లోకి  వెళ్ళిన వారిలో సగం మంది మనకి తెలిసిన వారే. వీరిలో సీరియల్లో నటించేవారు,  వెబ్ సిరీస్ నుంచి వచ్చిన వారు గుర్తింపు ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉండే వారు ఎంత  రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఇంట్లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ పాపులర్ యూట్యూబర్ ఆదిరెడ్డి అని తెలిసిన సమాచారం. అతనికి వారానికి రూ. 1.75 లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version