Site icon Prime9

Bigg Boss 6: బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వాసంతి

biggboss-vasanthi

biggboss-vasanthi

Big Boss 6: ఆదివారం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 లో వాసంతి ఎలిమినేట్ అయ్యింది.ఇక ఈ వారం ఎనిమిది మంది హౌస్‌మెట్స్ నామినేషన్స్‌లో ఉండగా, ఆదివారం కావడంతో ఫన్నీగా గేమ్స్ ఆడుతూ ఒక్కొక్కరు సేవ్ అవుతూ కనిపించారు. అయితే చివరికి మెరీనా, వాసంతి మాత్రమే మిగిలారు. దాంతో ఆ ఇద్దరికి లాస్ట్‌లో నాగార్జున ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఫలితంతో వాసంతి ఎలిమినేట్ అయ్యింది. అయితే నామినేషన్స్ లో ఉన్నవారికి సిలిండర్ లాంటి ఒక వస్తువు ఇచ్చి దానిలోపల ఉన్నదాన్ని బయటకు తీయాలన్నారు నాగార్జున. అందులో నుంచి నిచ్చెన వస్తే సేఫ్ అని, పాము వస్తే అన్‌సేఫ్‌గా అని తెలిపారు. మెరీనా, ఆది రెడ్డి, శ్రీహాన్, రేవంత్, వాసంతి, ఇనయలకి పాము రావడంతో అన్‌సేఫ్‌గా అయ్యారు. అలాగే కీర్తి, పైమా‌కి నిచ్చెన రావడంతో సేఫ్ అయ్యారు.

అనంతరం రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనయలు సేఫ్ అయ్యారు. చివరికి మెరీనా, వాసంతిలు మిగిలారు. అయితే మెరీనా, వాసంతిల ముందు ఫిష్ బౌల్స్ పెట్టిన నాగార్జున, వారి చేతికి ప్లవర్ ఇచ్చి అందులో ముంచాలని చెప్పాడు. ఎవరి పువ్వు అయితే రెడ్ కలర్ లో మారుతుందో వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు. కాగా ఈ గేమ్ లో మెరీనా సేఫ్ అవ్వగా, వాసంతి ఎలిమినేట్ అయ్యింది.వాసంతికన్నీళ్లతో హౌస్‌ని వీడింది.స్టేజ్‌పై ఆమె జర్నీని చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యింది.

Exit mobile version