Site icon Prime9

Karthika Deepam: అక్టోబర్ 21 ఎపిసోడ్ లో కూతురు సౌర్యా కోసం అల్లాడిపోతున్న కార్తీక్

karthika-deepam oct 21 prime9news

karthika-deepam oct 21 prime9news

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. కార్తీక్ బాధగా ఒక చోట కారును ఆపి, ఆలోచనలో పడతాడు. ఆ ప్రదేశంమంతా చిన్న రోడ్డు లాంటింది. వాకింగ్ చేస్తూ వెళ్లే స్థలం. అక్కడే ఓ పక్కకు కార్తీక్ కారును ఆపి,  దీప గురించి, సౌర్య గురించి, మోనిత కుట్రల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ‘నీ కోసం ఎంత వెతికినా నీ జాడ తెలియట్లేదు ఎక్కడున్నావ్ సౌర్యా’ అని మనసులో అనుకోని బాగా అల్లాడిపోతూ ఉంటాడు. అప్పడే ఆ రోడ్డు వైపుగా వచ్చినా సౌర్య, ఇంద్రుడు ఇద్దరూ నడుచుకుంటూ వస్తుంటారు. ‘ఈ రోజు కూడా ఏం ఫలితం లేదు బాబాయ్’ అని అంటుంది. ‘ఇప్పటికే బాగా తిరిగేశాం బాగా అలిసిపోయి ఉంటారు. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్లిపోదాం’ అని ఇంద్రుడు అంటాడు. ‘సరే బాబాయ్’ అని సౌర్య అంటుంది.

సౌర్య కిలకిల పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు కార్తీక్ ఆలోచనల్ని డిస్టబ్ చేస్తుంది. ఆ నవ్వు సౌర్యదే అని గుర్తు చేసుకుంటాడు. వెంటనే సౌర్యా అని మనసులో అనుకుంటూ, రోడ్డు వైపు పరుగులు తీస్తాడు. ఈలోపే సౌర్య, ఇంద్రుడు వాళ్లు మరో వైపు వెళ్ళడంతో కార్తీక్‌కి వాళ్లు కనిపించరు. పాపం కార్తీక్, పిచ్చి వాడిలా అల్లాడిపోతూ అన్ని వైపులా తిరిగి వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా సౌర్య కనిపించకపోవడంతో  ఏడుస్తూ  ‘సౌర్యా’ సౌర్యా అంటూ పెద్ద పెద్దగా అరుస్తాడు.

Exit mobile version