Site icon Prime9

Bigg Boss Telugu 6: ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న ఫైమా

biggboss-76-episode

Big Boss Telugu 6: బిగ్ బాస్ ఎపిసోడ్ హైలెట్స్ చూద్దాం. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య గట్టి ఫైట్‌ నడిచింది. ఈ టాస్క్ లో చివరగా ఫైమా, రేవంత్‌, శ్రీహాన్‌లు మిగిలారు. దాంతో మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకి నచ్చిన వాళ్లకి సపోర్ట్‌ చేసి, మిగిలిన కంటెస్టెంట్లకు బస్తాను తగిలించి బరువు పెంచాల్సి ఉంటుంది. అయితే కెప్టెన్సీ టాస్కులో రేవంత్‌, శ్రీహాన్‌లు కలిసి టాస్క్ ఆడి ఎలా హోస్‌మేట్స్‌ని తప్పించారో, దాన్ని దృష్టిలో ఉంచుకుని, సత్య తప్పా మిగితా కంటెస్టెంట్లు అంతా రేవంత్‌, శ్రీహాన్‌లకి బుద్ది చెప్పారు.

బజర్ మోగిన ప్రతిసారి శ్రీహాన్‌, రేవంత్‌ లకు బస్తాలు వేస్తూ పోయారు. అయితే శ్రీసత్య మాత్రం తన ఫ్రెండ్స్‌ని సపోర్ట్‌ చేయడానికి ప్రయత్నించింది. కానీ హౌస్‌మేట్స్‌ అంతా ఒకటైపోవడంతో ఆమె ప్రయత్నించిన లాభం లేకపోయింది. ఈ టాస్క్ లో బస్తాల బరువులు మోయలేక ఆ బ్యాగ్‌ను శ్రీహాన్‌ కింద పెట్టేశాడు. వెంటనే సత్య వెళ్లి శ్రీహాన్‌ను ఓదార్చింది.

రేవంత్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ టాస్కులో గెలవడానికి చాలా కష్టపడినా, హౌస్‌మేట్స్‌ అందరి సపోర్ట్‌ అతనికి కాకుండా ఫైమాకే ఇవ్వడంతో రేవంత్‌ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది. టాస్కులో చివరికి ఫైమాకు ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ దక్కడంతో ఆమె చాలా సంతోషపడింది.

Exit mobile version