Site icon Prime9

Bigg Boss: మెరీనా అవుట్.. కన్నీటి పర్యంతమైన రోహిత్

bigg boss season 6 telugu 11 week eliminations marina eliminated

bigg boss season 6 telugu 11 week eliminations marina eliminated

Bigg Boss: బిగ్ బాస్ హౌస్ ప్రతీ సీజనల్ ఓ అందమైన జంటకి కూడా అవకాశం ఇస్తూ వస్తున్నారు. అలా ఈ సీజన్ లో రోహిత్ – మెరీనా హౌస్ లోకి వచ్చారు. ఇద్దరూ బుల్లితెరపై మంచి ప్రజాదరణ పొందినవారే. రోహిత్ హౌస్ లో ఉన్న వాళ్లందరి కంటే హ్యాండ్సమ్. అలాగే మెరీనా కూడా గ్లామర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ ఆరంభంలో ఇద్దరూ కలిసి ఆడారు. ఎవరికి వారుగా ఆడితేనే ఇంట్లో కొనసాగుతారని బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం మేరకు ఎవరికి వారుగా ఆడుతూవచ్చారు.

కాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ కపుల్ ప్రతి గేమ్ లోనూ మంచి ప్రతిభ కనపరిచేవారు. అయితే మెరినా ఏ గేమ్ నుంచి తప్పుకున్నా పెద్దగా బాధపడేది కాదు కానీ తన భర్త రోహిత్ విషయంలో మాత్రం ఆమె ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయేది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా రోహిత్ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆమె బాధపడేది. ఇకపోతే ఆమె అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకుని రోహిత్ ఓదార్చుతూ రావడం వల్ల ఆడియన్స్ కి వీరి జంటకు బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పవచ్చు.

అలాంటి ఈ జంటలో 11వ వారం ఎలిమినేషన్లో భాగంగా మెరీనా నిన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ ప్రక్రియలో అతి తక్కువ ఓటింగ్ తో శ్రీసత్య మరియు మెరినా ఉండగా ఆఖరికి శ్రీసత్య సేఫ్ అయ్యి మెరీనా ఎలిమినేట్ అయ్యింది. దానితో ఆమె తన భర్తను హగ్ చేసుకుని ఏడ్చేసింది. బయటికి వెళ్లలేక వెళ్లలేక వెళ్లింది. మెరీనా వెళ్లిపోయిన తరువాత రోహిత్ కన్నీటి పర్యంతమయ్యాడు. రేవంత్, ఆదిరెడ్డిలు ఓదార్చుతున్నా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇంతవరకూ మెరీనా గేమ్ టెన్షన్ ను కూడా తాను తీసుకుంటూ వచ్చిన రోహిత్, ఇక తన ఆటతీరుతో టాప్ 5 కంటెస్టెంట్లలో ఉంటాడో లేదో వేచి చూడాలి.

ఇదీ చదవండి: చిరంజీవిని వరించిన మరో అరుదైన అవార్డ్

Exit mobile version