Big Boss Season 6: బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఎందుకిలా చేస్తున్నారు. ఆయనకు నచ్చిన వాళ్లని మరి ముఖ్యంగా అమ్మాయిల్లో కొంతమందికి నాగార్జున సపోర్ట్ ఉందని, మిగిలిన హౌస్ మేట్స్ ని బ్యాడ్ చేసేట్టుగా నాగార్జున హోస్ట్ చేస్తున్నారా? అంటే దానికి సమాధానం ఔననే అంటోంది హౌస్ నుంచి ఎలిమినేట్ ఐనా కంటెస్టెంట్ నేహా చౌదరి. ఇక మూడోవారం నామినేషన్స్ చూసుకుంటే మనం ఎవరం ఊహించలేని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. ఐతే ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్న నేహా.
‘నేను ఎలిమినేట్ అయ్యానంటే నా సన్నిహితుల్లో చాలామంది నమ్మడం లేదు. ఇది అన్ ఫెయిర్ అంటున్నారు. నా స్నేహితులందరు టాప్ 2 వరకూ ఉంటాననే అనుకున్నారు. అసలు ఏ మ్యాటర్ లేని ఇంకా హౌస్లో ఉంటున్నారని అంటుంది. వాళ్ళ పేర్లు బయటకు చెప్పచ్చు కానీ, చెప్పడం కానీ అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. నిజాలు మాట్లాడుకుంటే వాసంతి దగ్గర కంటెంటే లేదు. కానీ ఆమె బిగ్ బాస్ ఇంట్లో అందగత్తె కదా, అలాగే గ్లామర్ డాల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఉంది. ఆమె పెర్ఫామెన్స్ కూడా ఇంట్లో ఏం లేదు. ఇక ఇనయ విషయం గురించి మాట్లాడుకుంటే ఆ వారం మొత్తం ఆమె గురించి నెగెటివ్ గా మాట్లాడారు. కానీ వీకెండ్‌లో నాగార్జున గారు వచ్చి నా వెర్షన్ మాత్రమే తీసుకొని జరిగిందంతా రివర్స్ చేశారు. నిజంగా నా వైపు తప్పు ఉంటే, జరిగిన రోజు ఎపిసోడ్‌లో ఎందుకు హైలైట్ కాలేదు. అలాగే ఆ తరువాతి ఎపిసోడ్‌లో కూడా నేను ఎందుకు లేనని అడుగుతుంది. ఎందుకంటే నన్నుఎలిమినేట్ చేయాలని వారు ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి. నన్ను బ్యాడ్ చేసి హౌస్ నుంచి బయటికి పంపించడానికి నాగార్జున గారు ఆ పాయింట్‌ని తీసుకుని వచ్చారు. నాగార్జున సార్ ఇలా హోస్ట్ చేస్తారని అసలు అనుకోలేదని నేహా తన మాటల్లో ఆవేదన వ్యక్తం చేసింది.