Site icon Prime9

Bigg Boss Season 6: ఇనయానే టార్గెట్… శ్రీ సత్య ఆ మాట వెనుక దాగిన నిజం ఏంటి..?

biggboss 6 15th day episode

biggboss 6 15th day episode

Bigg Boss Season 6: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని వరుస సీజన్లతో దూసుకుపోతుంది. కాగా సీజన్ 6 కొద్దిరోజుల ముందే ప్రారంభం అయ్యింది. దీనిని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారే చెప్పవచ్చు. ఈ సారి బిగ్ బాస్ హౌస్లోకి 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. కాగా మరి ఈరోజు అనగా బిగ్ బాస్ ఇంట్లో 15వ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యంది.

ఇంట్లో తినడానికే వచ్చారా అంటూ కొంతమందికి నాగార్జున క్లాసు తీసుకున్నారు. దీనిని శనివారం నాటి ఎపిసోడ్‌లో మనం చూశాము. అయితే ఆ క్లాసు బాగా పనిచేసినట్టే కనిపిస్తుంది. ఎవరు నామినేట్ చేసినా ఓ నవ్వు విసురుతూ ‘ఓకే’అంటూ ఉండే వాళ్లు కూడా ఈసారి నామినేషన్లలో కొట్టుకున్నారు. అయితే ఈ సారి ఎందుకో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఇనయాను టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నారు.

శ్రీ సత్యా వచ్చిన రోజు నుంచి ఆటపై పెద్దగా ఇష్టం లేనట్టుగానే ప్రవర్తించేది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్లో శ్రీసత్యను హోస్ట్ నాగార్జున గట్టిగానే హెచ్చరించారు. సోమవారం నామినేషన్ ఎపిసోడ్ లో భాగంగా కంటెంస్టెంట్లకు వారివారి రీజన్లు చెప్పి రంగు పూసి నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఇనయాకు రంగు పూసి నామినేట్ చేసింది శ్రీ సత్యా. దానికి ఇనయా ‘ఇది సిల్లీ నామినేషన్’అంది. ‘నీకు గేమ్ ఆడాలనే లేదు, కూర్చొని ముచ్చుట్లు చెప్తూ ఉండేందుకు వచ్చావ్ అంటుంది ఇనయా. దానికి శ్రీ సత్యా ‘కొత్తగా చెప్పేదేముంది సిల్లీ నామినేషన్ అని’ అనుకుంటూ వెళ్లపోతుంది. మరి ఆ మాట వెనుక ఆమె ఉద్దేశం ఏంటో ఆమెకే తెలియాలి. నామినేషన్లను ఆమె సిల్లీగా తీసుకుంటోందా అంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు ఇనయాకే రంగు పూసి నామినేట్ ఆదిరెడ్డి చేశాడు. దానికి ఇనయా ‘మీరు చాలా గేమ్ తెలుసుకుని వచ్చారు కాబట్టి’అనే సరికి ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. కోపంగా ‘బిగ్ బాస్ పళ్లెం ఎత్తేస్తా’అంటూ గట్టిగా అరిచేశాడు. ఇకపోతే నువ్వు ఆడే తీరు నాకు నచ్చడం లేదు అంటూ గీతూని ఇనయా నామినేట్ చేసింది. దానికి గీతూ నా ఆట ఎలా ఆడాలో నాకు తెలుసు ఇక్కడ్నించి దొబ్బెయ్ అంటూ చిరాకు పడింది.
చంటి – గీతూ మధ్య మళ్లీ సంస్కారం గురించి గొడవ జరిగింది. మరి వీరిరువురి మధ్య ఏ రేంజ్లో సాగిందో ఎపిసోడ్ లో చూడాల్సిందే. సుదీపని గీతూ నామినేట్ చేసింది. కానీ ఏ కారణం వల్లో తెలియదు. సుదీప ఆ విషయంలో చాలా ఎమోషనల్ అవుతూ బాధపడింది.

కాగా ఈ వారం నామినేషన్లో పదిమంది ఉన్నట్టు తెలుస్తోంది.
1. ఇనయా
2. గీతూ
3.శ్రీహాన్
4. నేహ
5. చంటి
6. వాసంతి
7. ఆదిత్య
8. సుదీప
9. రేవంత్
10. ఆరోహి.. మరి ఎవరే రీజన్ చెప్పి ఎవరెవరిని నామినేట్ చేస్తారో పూర్తి వివరాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు.

ఇదీ చదవండి: Bigg Boss season 6: గీతూ బేబీ బొమ్మను దొంగిలించిన సింగర్ రేవంత్

Exit mobile version