Site icon Prime9

Bigg Boss 6: ఈ వారం బిగ్‌బాస్ నుంచి సూర్యా ఎలిమినేట్

rj surya prime9news

rj surya prime9news

Big Boss 6:  బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి శనివారం సూర్యా  డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ఇంటి సభ్యులు అందరూ నామినేషన్స్‌లో ఉండగా, శనివారం మామూలుగా జరిగే సేవింగ్ ప్రాసెస్ ఏమీ లేదని నాగార్జున చెప్పగా సూర్యా ఎలిమినేట్ ఐనట్లు ప్రకటించేశాడు. సూర్యాని పట్టుకుని ఇనయ బాగా ఏడ్చింది. సూర్యా బిగ్ బాస్ హౌస్ దాటి వెళ్లిపోయిన తర్వాత కూడా డోర్ దగ్గర కూర్చుని చాలాసేపు ఏడ్చుకుంటూ అలానే కూర్చొంది. ఆదివారం స్టేజ్‌పైకి సూర్య రానున్నట్లు నాగార్జున చెప్పి ఎపిసోడ్ ముగించారు.

శనివారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ వారం చేపల చెరువు టాస్క్లో భాగంగా హౌస్‌మెట్స్ అందరి ఆటతీరు పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాగార్జున అందరికీ ఆయన స్టైల్లో అక్షింతలు వేశారు. ముఖ్యంగా ఎప్పుడు గలగల మాట్లాడే గలాట గీతు కూడా నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌కి ఎపిసోడ్ ఐపోయే సరికి నోరు మూసుకొని సైలెంటుగా ఉంది. అంతలా నాగార్జున ఆమెకి క్లాస్ తీసుకున్నాడు.

Exit mobile version