Site icon Prime9

Bigg boss 6: బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్న సుడిగాలి సుధీర్

sudheer prime9news

sudheer prime9news

Big boss 6: ఈ సారి బిగ్ బాస్ షో రేటింగ్స్ అమాంతం పడిపోయేలా ఉన్నాయి. నిలదొక్కుకోవడం కూడా చాలా కష్టమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. నారాయణ లాంటి వాళ్ళు ఈ షో ఒక బ్రోకర్ హౌస్ అని, వెంటనే ఈ షోని నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంటి సభ్యుల ఆట తీరుతో కాకుండా వివాదాలతో రోజు బిగ్ బాస్ వార్తల్లో నిలుస్తోంది.

ఇదే క్రమంలో ఈ షోకు రేటింగ్స్ పెంచాలనే నిర్ణయం తీసుకొని, పక్కా ప్లాన్స్ చేస్తున్నారని తెలిసిన సమాచారం. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు నాగార్జున గట్టిగా క్లాస్ పీకడంతో అందరు ట్రాక్ లోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కంటస్టెంట్ల ఆటతీరు కాస్త మెరుగుపడుతోంది.

ఐతే ఈ బిగ్ బాసుకు క్రేజ్ పెంచాలంటే ఓ బలమైన కంటిస్టెంట్ రంగంలోకి దింపాల్సిందే అని బిగ్ బాస్ యాజమాన్యం ఫిక్స్ ఐనట్టు తెలుస్తుంది. ఇదే మేరకు పక్కా ప్లానింగ్‌తో ఫేమస్ జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ను బిగ్ బాస్ ఇంట్లో తీసుకురావాలని, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సుడిగాలి సుధీర్ ను బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకొచ్చి ఈ షోని గాడిలో పెట్టాలని కొత్త స్కెచ్ వేసుకున్నారని, ఈ మేరకు సుధీర్ తో చర్చలు జరుపుతున్నారని, దీని కోసం  సుధీరుకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారని తెలిసిన సమాచారం. ఈ  వార్తల్లో ఎంత నిజం ఉన్నదో, తెలుసుకోవాలనుకుంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version