Site icon Prime9

Bigg Boss 6 : గీతూకు , నాగార్జునతో స్పెషల్ క్లాస్ !

big boss oct 30 prime9news

big boss oct 30 prime9news

Bigg Boss 6 : బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఓవర్‌ యాక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు.ఇంట్లో ఆమె ఒక్కటే గేమ్ ఆడుతున్నట్టు భ్రమలో బతికేస్తోంది. తనే ఒక గేమర్,తన కంటే తోపులు లేరన్నట్టు చేస్తుంది.గురువింద గింజకు తన కింద ఉండే నలుపు తెలీదన్నట్టుగా.. గీతూ కూడా తనలోని లోపాలను గుర్తించలేదు అలాగే ఎవరైనా చెప్పినా వినదు..కనీసం మారేందుకు కూడా ప్రయత్నించదు.నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఉంటుంది.కానీ మిగతా వాళ్లను మాత్రం వేలెత్తి చూపుతుంది.బిగ్ బాస్ ఇంట్లో మొదటి నుంచి గీతూ చేసేది అదే. కానీ ఆవిడ గారు ఆట తీరు బాగుందంటూ నాగార్జున ఆమెను నెత్తిన పెట్టుకుంటూ వచ్చాడు.

నిన్నటి ఎపిసోడ్‌లో కాస్త గీతూ సైలెంటుగా గా ఉంది.తొక్కలో ఆట అంటూ గీతూ పరువు తీశాడు నాగార్జున.నీకు అసలు ఆట ఆడటం కూడా రాదని అన్నాడు. నువ్వెవరు అసలు ? ఆటను ఆడించడానికి బిగ్ బాస్ టీం ఉంది..ముందు నీ ఆట నువ్ సరిగ్గా ఆడు.. ఎవరి ఆట వాళ్లు ఆడితే..ఈ సీజన్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుందని అని గీతూని ఒక రేంజులో వేసుకున్నారు.ఐతే గీతూ ఈ క్రమంలో కొన్ని మాటలు ఆలోచించకుండా అనేసింది.నేను ఏదైనా టాస్కులో ఓడిపోతే నేను తీసుకోలేను, తట్టుకోలేనని అనేసింది.బిగ్ బాస్ టీంకు కూడా గీతూ వేషాలు నచ్చలేదనుకుంటా.. వారికి బాగానే కాలినట్టుంది.అందుకే నాగార్జునతో స్పెషల్ క్లాస్ ఇప్పించారు.

Exit mobile version