Site icon Prime9

Bigg Boss 6 : రేవంత్ పచ్చి పెరుగు దొంగ అని ముద్ర వేసిన గీతూ

big boss 25 oct prime9news

big boss 25 oct prime9news

Bigg Boss 6 : బిగ్ బాస్ ఇంటిలో ఏవి తగ్గుతున్న రోజు రోజుకు గీతూ ఆగడాలు మాత్రం తగ్గడం లేదు.వీళ్ళకు మాట్లాడుకోవడానికి ఏ ముచ్చట్లు దొరకనట్టు తిండి ముచ్చట్లు పెట్టి మరి ఒకరినినొకరు తిట్టుకుంటున్నారు.ఈ సమయంలో అందరికీ ఒక్క ప్యాకెట్ పెరుగు చాలని గీతూ చెప్పింది. ఒక్క ప్యాకెట్ పెరుగు ఎవరికీ సరిపోదని రేవంత్ అన్నాడు. దీంతో పెరుగు, పాలు పెట్టుకోవాలని గీతూ మేడమ్ గారు అన్నారు .పెరుగు తినని వాళ్లకు పాలు ఐనా కొంచె ఎక్కువ ఇవ్వండని అడిగింది.ఆ మాటను అందుకున్న రేవంత్.. పిలిచిన వెంటనే భోజనానికి రావాలని, అప్పుడే అందరికీ అన్నీ సమానంగా వస్తాయని అన్నాడు.ఆ మాటలకు మన గీతూ గారికి కోపం వచ్చి ‘‘సగం పెరుగు దొంగవి నువ్వే’’ అని రేవంత్‌ను మొహం మీదే అనేసింది.కేవలం నీ వల్లే పెరుగు ఎవ్వరికీ సరిగా రావట్లేదు అని అన్నది.

ఇంక రేవంత్‌కు కోపం వచ్చి‘‘ ఈ మాట వేరేవాళ్లను చెప్పమను.. వంటింట్లో కూర్చొని చేస్తే నీకు తెలుస్తుంది పని..బయట కూర్చొని కబుర్లు చెప్పడం కాదు’’ అని రేవంత్ అన్నాడు. ‘‘బయట కూర్చొని మాట్లాడటం వల్ల నువ్వు ఏమైనా పెరుగు తినడం ఆపేస్తావా ఏంటి..నాకు అర్థంకాక అడుగుతున్నా’’ అని గీతూ తన స్టైల్లో అడిగింది.ఇక రేవంత్‌కి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అస్సలు ‘‘నువ్వెవరు నన్ను అడగడానికి’’ అని రేవంత్,గీతూ మీద ఫైర్ అయ్యాడు.నువ్వు కూడా పెరుగును దాచుకుని తింటావ్ అని గీతూ కూడా తిరగబడింది. ‘‘నా ఇష్టం నా పెరుగు నీకు ఏమైనా నొప్పి’’ అని రేవంత్ అన్నాడు.‘‘నువ్వు పెరుగు ఎక్కువ దాచుకుంటున్నావు..నేను చూశాను’’ అని గీతూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.నువ్వు చేసేదే ఆ పనిగా అంటూ అంటూ రేవంత్ చిర్రుబుర్రులాడాడు.

Exit mobile version