Site icon Prime9

Bigg Boss 6: గీతూ చెత్త సంచాలక్ అని ముద్ర పడిపోయింది!

geethu 22 prime9news

geethu 22 prime9news

Big Boss 6: బిగ్ బాస్ దత్త పుత్రిక గీతూ మేడమ్ గారికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఆమెను బిగ్ బాస్ ఏకడికో తీసుకెళ్తున్నారని అనిపిస్తుంది. కెప్టెన్సీ టాస్క్ తొలి రౌండ్‌లోనే తన అసమర్ధత ఆటతో చేతులు ఎత్తేసిన గీతుని సంచాలక్ చేసి కెప్టెన్సీ టాస్క్ ను ఆమె చేతుల్లో పెట్టాడు బిగ్ బాస్. ఆమెను సంచాలక్ చేయడమే కాకుండా, ఈ టాస్క్ లో బాగా ఆడి టాప్ లో నిలిచిన బ్లాక్ ఫిష్ ఇచ్చి రేవంత్-ఇనయలకు చెక్ పెట్టించారు.

ఐనప్పటికి వాళ్ల కెప్టెన్సీ ఆశలు సజీవంగానే ఉండిపోయాయి. గీతు సంచాలక్‌గా ఎన్ని కుట్రలు పన్నిన కెప్టెన్సీ పోరులో నేనే గొప్ప అంటూ తగ్గేదేలే అన్నట్టుగా రేవంత్ తన ఆటను ఆడుతున్నాడు. ఈ టాస్క్ లో గీతు సంచాలక్‌గా ఎంత చెత్తగా చేసిందో రేవంత్, కీర్తి మాట్లాడుకున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో గీతుని కుక్కతో పోల్చిన కీర్తి, ఇక బాలాదిత్య పై పగబట్టిన మహానటి శ్రీ సత్య, ఈమె ఏదో పెద్ద కరెక్ట్‌గా ఉన్నట్టు గీతు దగ్గర కూర్చుని బాలాదిత్య గురించి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది. తన క్యారెక్టర్ గురించి వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూసిన బాలాదిత్య నవ్విన నవ్వు ఎపిసోడ్ కె హైలైట్ గా నిలిచింది.

Exit mobile version