Site icon Prime9

Bigg Boss 6: నవ్వుతూ మాట్లాడుతూనే ఆది రెడ్డిని డీప్ గా హర్ట్ చేసిన గీతూ

big boss 21 oct prime9news

big boss 21 oct prime9news

Big Boss 6: ఆదిరెడ్డి గురించి మాట్లాడుకోవాలిసి వస్తే ఆదిరెడ్డి ఆటకు పుల్లలు పెట్టి తన ఆటను తను ఆడనివ్వకుండా సగం కంపు చేస్తున్నది గీతునే. అతని ముఖం మీద కాళ్లు పెట్టి ఊపుతూ పిచ్చి పిచ్చిగా చేస్తుంటే, అది చూసిన నెటిజన్స్ వాట్ ఈజ్ దిస్ గీ‘థూ’అని కామెంట్స్ చేస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌లో ఐతే ఆది రెడ్డిని చాలా తెలివిగా గీతూ బురిడి కొట్టించింది.తన వేలుతో తన కన్ను పొడుచుకునేలా చేస్తుంది. అదెలా అంటే గీతు-ఆదిరెడ్డిలు ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకుని సొల్లు ముచ్చట్లు పెట్టారు. ‘ఈ సీజన్‌లో అంతా తుప్పాస్ కంటెస్టెంట్స్ వచ్చారు’ అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ మాటకు ఓ నెటిజన్ (నిజమే వీళ్లిద్దరితో సహా అంతా తుప్పాస్ గాళ్లే అని ) కామెంట్ చేశాడు. ఆ తరువాత ఆదిరెడ్డిని కత్తి పెట్టి పొడవకుండానే ఒక్క మాటతో గుండెల్లో గుచ్చేసింది. నువ్వు మొదటి నుంచి సరిగా పెర్ఫామ్ చేయట్లేదు ఆదిరెడ్డీ. ఉదయం గంట ఏదో చేశావ్. తరువాత ఏం చేశావో నీకు గుర్తు ఉందా. నువ్ నన్ను చాలా హర్ట్ చేశావ్ ఆదిరెడ్డీ. నువ్ బిగ్ బాస్‌ని డిజప్పాయింట్ చేశావో లేదో నాకు తెలియదు కానీ, నన్నుమాత్రం మాత్రం బాగా హర్ట్ చేశావ్. నాకు మొదటి సారి నిన్ను చూస్తే భయం వేస్తుంది ఆదిరెడ్డీ. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతావ్. ఈ సారి నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యే వాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆది రెడ్డిని ఇన్ డైరెక్టుగా మాటలతో బాధ పెట్టింది.

Exit mobile version