Site icon Prime9

Bigg Boss 6 : ఇంటి సభ్యులందరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ !

big boss oct 19

big boss oct 19

Bigg Boss 6 : బిగ్ బాస్ ఆదేశాలు అంటే నిర్లక్ష్యం..టాస్క్‌ల పట్ల నిర్లక్ష్యం.. మీ నిర్లక్ష్యం బిగ్ బాస్‌నే కాకుండా ప్రేక్షకుల్ని కూడా బాగా నిరాశపరిచింది.బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా..ఈ టాస్క్‌లన్ని రద్దు చేస్తున్నాం..ఈ షోపట్ల..ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోతే..బిగ్ బాస్ హౌస్‌ నుంచి నేరుగా బయటికి వెళ్లిపోండి అంటూ అని గట్టిగానే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఐతే హౌస్‌లో ఉన్న వాళ్లందర్నీ కలిపి తిట్టడంతో…కానీ ఇంట్లో ఉన్న వారు తిట్టింది నన్ను కాదు అన్నట్టుగా ప్రవర్తించి ఎవరికి తోచినట్టు వాళ్ళు భలే నటిస్తున్నారు. శ్రీహాన్ ఐతే మరి తానేదో పెద్ద ఇరగబొడుస్తున్నట్టుగా.. కెమెరా దగ్గరకు వెళ్లి.. సమయానికి తినాలి.. సోది ముచ్చట్లు పెట్టుకోవాలి..ముందు వాళ్లకి బిగ్ బాస్ షో గురించి అర్ధం అయ్యేలా చెప్పండి బిగ్ బాస్..అంటూ చెప్పుకొచ్చాడు.ఇంట్లో ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల మా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది’ అని వీర లెవల్లోయాక్టింగ్ మొదలుపెట్టాడు. బిగ్ బాస్ అందర్నీ కలిపి తిడితే.. శ్రీహాన్ మాత్రం వాళ్లందరూ ఆడట్లేదు.. నేను మాత్రమే ఆడుతున్నా అన్ని బిల్డప్పుల బాబాయ్ లా చెబుతున్నాడు.అది చూసిన నెటిజన్స్ ముందు యాక్టింగ్ ఆపి.. ఏ కెమెరాకి ఏ యాంగిల్ ఇవ్వాలో బాబాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అలాగే ముందు నీ ఆట నువ్వు ఆడు… తరువాత అందరి గురించి మాట్లాడవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version