Site icon Prime9

Bigg Boss 6: బెలూన్స్ టాస్క్ లో గెలిచి బాస్ హౌస్‌ ఇంటి కెప్టెన్ ఐనా శ్రీసత్య

sri satya prime9news

sri satya prime9news

Big Boss 6: శ్రీసత్య ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్‌ ఇంటి  కెప్టెన్ అయ్యింది. ఈ టాస్క్లో అందరి కంటె శ్రీసత్య బాగా ఆడింది. ఈ టాస్క్ రసవత్తరంగా సాగగా చివరి వరకు తన చేతిలో ఉన్న బెలూన్ కాపాడుకుని టాస్క్‌ను గెలిచి బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది. ఐతే, ఎప్పటిలానే ఈ కెప్టెన్సీ టాస్క్‌ను పూర్తిచేసేటప్పుడు ఇంటి సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు కనిపించాయి.

కెప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే, ఈ టాస్క్ లో పాల్గొన్న పోటీదారులు శ్రీసత్య, ఫైమా, గీతూ, ఇనయ, వాసంతి, మెరీనా వీరందరూ తన బెలూన్లను కాపాడుకుంటూ ఇతరుల దగ్గర ఉన్న బెలూన్లను పగలగొట్టాలి. ఇలా చివరికి ఏ పోటీదారు దగ్గర బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే ఈ టాస్క్‌లో గెలిచి ఇంటి కెప్టెన్ అవుతారు. ఐతే ఈ టాస్క్ లో ఆదిరెడ్డి సంచాలకుడిగా వ్యవహరించాడు. పోటీదారులు బెలూన్‌ను దుస్తుల్లో పెట్టుకోకూడదు. ఈ టాస్క్లో ఇంకో కండీషన్ కూడా ఉంది. కనీసం ఒక చేత్తో ఐనా బెలూన్‌ను పట్టుకుని ఉండాలి. అంతేకాకుండా టాస్క్ ఆడుతున్నప్పుడు బాత్‌రూంలోకి కానీ, బెడ్‌రూంలోకి కానీ ఎక్కడికి వెళ్లకూడదు. ఒకవేళ ఒక పోటీదారు చేతిలో ఉన్న బెలూన్ పగిలిపోయినా వారు ఈ టాస్క్ నుంచి తప్పుకోవాలి. ఇలా చివరికి శ్రీ సత్య బెలూన్ మిగిలింది. శ్రీసత్య గెలవడంతో శ్రీహాన్, రేవంత్, గీతూ, ఫైమా ఒక రేంజులో పండగ చేసుకున్నారు. గట్టి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.

Exit mobile version