Site icon Prime9

Bigg Boss Season 6: బిగ్ బాస్ ఇంట్లో ఎఫైర్ల రచ్చ మామూలుగా లేదుగా..!

big boss 28 prime9news

big boss 28 prime9news

Big Boss Season 6: బిగ్ బాస్ హౌస్‌ మేట్స్ మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా మంచి స్టఫ్ ఉండేలా కూడా చూసుకుంటాడు. ఈ స్టఫ్ ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య గొడవలు అయినా ఉండాలి. లేదా ఎవరైనా ఇద్దరు ఆడ, మగ మధ్య లవ్ ఎఫైర్లు, లవ్ సాంగ్‌లు, రొమాన్స్‌లు ఆన్ స్క్రీన్ వరకు పెట్టి షో ఏపిసోడ్స్ ను నెట్టికొచ్చేస్తారు. ఇప్పటి వరకూ ప్రతి సీజన్‌లో ఇదే గోల. ఇదే లవ్ ఎఫైర్స్, ఈ లొల్లి మాత్రం పక్కా ఉంటుంది. గత సీజన్‌లో అయితే సిరి-షణ్ముఖ్‌లు ఎంత చెండాలం చేశారో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సీజన్లో కూడా ఇలాంటి స్టఫ్ మొదలయ్యిందనే చెప్పుకోవాలి. అంతే కాదు ఈ సీజన్‌లో ఐతే అంతా పెళ్లి కానీ వాళ్ళే ఉండటంతో చూసే వారికి దొరికినంత స్టఫ్ దొరుకుతుంది.

ఈ సీజన్లో ముందు వరుసలో ఉన్నది ఆరోహి-ఆర్జే సూర్యలు. వీరిద్దరూ టీవీ 9లో యాంకర్లుగా పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి ఒకే ప్రోగ్రామ్‌ కూడా చేస్తున్నారు. అంతే ఇక ఆరోహి పిట్ట ఆర్జే సూర్యకు పడిపోయింది. వీరిద్దరి మధ్య పరిచయం, ప్రేమ బందంగా మారి లవర్స్‌గా ఉంటున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ కు రాకముందు వీరు మామూలు స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరి సన్నిహితులు మాత్రం వాళ్ళు లవర్స్ కాదు అబ్బే వాళ్లు జస్ట్ ఫ్రెండ్సూ అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత వీరి స్నేహం ప్రేమగా మారిపోయింది.

ఇదీ  చదవండి: ఇనయని మరోసారి టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు

Exit mobile version