Site icon Prime9

Anchor Sowmya Rao : అమ్మని గుర్తు చేసుకుంటూ వీడియో పోస్ట్ చేసిన జబర్దస్త్ యాంకర్.. చూస్తే కన్నీళ్ళు ఆగవు

anchor sowmya rao video post about her mom goes viral

anchor sowmya rao video post about her mom goes viral

Anchor Sowmya Rao : బుల్లితెరపై మంచి ప్రేక్షకులను అలరిస్తున్న షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాల నుండి ఈ షో ఈటీవీలో ప్రసారమవుతూ అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఇందులో పాల్గొనే కమెడియన్స్ కూడా తమ కామెడీ టైమింగ్స్ తో అందర్నీ నవ్వించి మంచి పేర్లు సంపాదించుకున్నారు. ఇక యాంకర్ల విషయానికి వస్తే అనసూయ, రష్మి గౌతమ్ లకు కూడా ఈ షో మంచి గుర్తింపుని అందించింది. ఇక ఇటీవల ఈ షో కి కొత్త యాంకర్ సౌమ్య రావు అడుగుపెట్టిన సంగతి. అతి తక్కువ సమయంలో సౌమ్యరావు తన మాటలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

సౌమ్యారావు.. కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఈమె మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయమైంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే సడెన్‌గా అనుకోకుండా జబర్దస్త్‌ యాంకర్‌గా కామెడీ షోలోకి అడుగుపెట్టింది. షోలో చలాకీగా ఉంటే సౌమ్య కంటెస్టెంట్ల మీద అదిరిపోయే పంచులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అయితే స్మాల్‌ స్క్రీన్‌పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సౌమ్య జీవితంలో ఎన్నో కన్నీటి కష్టాలున్నాయి అని తెలుస్తుంది. ఆమె తల్లి ఎంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొందో తెలిస్తే కన్నీళ్లు ఆగేలా లేవు. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందింది.

అయితే తల్లిని తల్చుకుని ఇటీవల ఎమోషనలైంది సౌమ్య. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొ‍న్న నరకం గురించి వర్ణిస్తూ.. అలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా  వైరల్ గా మారింది. దాంతో అభిమానులు, నెటిజన్లు ఈమెకు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఆ పోస్ట్ లో ఎమోషనల్ గా రాసుకొచ్చింది సౌమ్య రావు.. ఇంతకీ ఏం రాసింది అంటే.. అమ్మ, అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్‌మెంట్, మందులు, బాధ. అమ్మంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అమ్మ కోసం దేవుడి గుడికి వెళ్లి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నీ మీద, నా మీద దయ చూపలేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చాలా బాధపడుతున్నాను. అందరూ అమ్మ ఫొటో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే, నాకు మాత్రం ఆఖరి రోజుల్లో నువ్వు పడిన బాధలే జ్ఞాపకం వస్తున్నాయి. రాత్రి పగలు నీకు సేవ చేసినా, దేవుడికి పూజలు చేసినా, అన్నీ వృథాగా మిగిలిపోయాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగానే మిగిలింది. ప్రతి రోజు, ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు నా కోసం మళ్లీ పుడతానని వేయికళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా మళ్లీ మా అమ్మానాన్నలను నాకు ఇవ్వు. హ్యాపీ మదర్స్ డే అమ్మా! నిన్ను ఎప్పుడూ మిస్‌ అవుతుంటారు. లవ్యూ సో…మచ్‌’ అంటూ అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది సౌమ్య.

Exit mobile version