Taraka Ratna Death Anniversary: సినీ హీరో నందమూరి తారకరత్న మరణించి నేటికి రెండేళ్లు. ఇవాళ ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి భర్త చిత్రపటం వద్ద నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ భర్తను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది.
కాలం నయం చేయలేని గాయం..
“నిన్ను నా నుంచి దూరం చేసిన రోజు మా జీవితంలో శూన్యాన్ని నింపింది. దానిని ఈ ప్రపంచంలో ఏవరూ ఎప్పటికీ పూడ్చలేరు. నిన్ను కోల్పోయిన క్షణం.. కాలం నయం చేయలేని గాయం.. మనం ఎప్పుడూ ఇలా విడిపోవాలని అనుకోలేదు.. నువ్వు ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ నీ ఉనికి.. మా జీవితాల్లో, నువ్వు వదిలి వెళ్లిన కలల్లో, నిన్ను మర్చిపోనికుండ చేస్తున్న ప్రేమలో అల్లుకుని ఉంది. మాటలకు, కాలానికి, జీవితానికి అతీతంగా నిన్ను ఎప్పటికీ మేము మిస్ అవుతూనే ఉంటాం” అంటూ భావోద్వేగానికి లోనయ్యింది.
లోకేష్ యువగళంలో అస్వస్థత
కాగా తరకరత్న మరణించినప్పటి నుంచి ప్రతి క్షణం, ప్రతి సందర్భంగా భర్తను గుర్తు చేసుకుంటూ అలేఖ్యా ఎమోషనల్ అవుతూనే ఉంటుంది. తరచూ తారకరత్నకు సంబంధించిన పోస్ట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భర్తను కోల్పోయిన బాధను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. కాగా తారకరత్న ఈ లోకాన్ని విడిచి నేటితో సరిగ్గా రెండేళ్లు అవుతుంది. 2023లో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నా ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో హుటినా ఆయనను ఆస్పత్రి చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నైలో చేర్పించిన చికిత్స అందించారు.
గుండెపోటుతో మృతి
తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి 2023 ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. నందమూరి నటవారసుడిగా ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంలో సినీరంగ ప్రవేశం చేశాడు తారకరత్న. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. అలాగే విలన్‌గానూ మెప్పించారు. ఆపై రాజకీయాల్లోకి రావాలనే ఆశయంతో టీడీపీ పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొన్న ఆయన ఊహించని పరిణామాలతో గుండెపోటుతో మరణించారు. కాగా తారకరత్నకు ఆలేఖ్యరెడ్డితో పెళ్లి కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు కూతురునిష్‌క, కవల పిల్లలు తాన్యారామ్, రేయా రామ్ సంతానం. తాతా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తన ముగ్గురు పిల్లల పేర్లలో మొదటి అక్షరాలు NTR వచ్చేలా పేరు పెట్టారు.