Site icon Prime9

Tamannaah Bhatia: బాలీవుడ్ ఆస్థాన ఐటెంభామగా మారిన మిల్కీ బ్యూటీ.. మరో సినిమాలో..?

Tamannaah Bhatia Flaunts Her Thumkas In New Raid 2 Song After 'Aaj Ki Raat

Tamannaah Bhatia Flaunts Her Thumkas In New Raid 2 Song After 'Aaj Ki Raat

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే బిజీగా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా  వెలుగొందిన తమ్ము.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బోల్డ్ సిరీస్ లతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అసలు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా సిరీస్ లో తమన్నాను చూసి.. అసలు మా తమ్మునేనా.. ఈ రేంజ్ గా ఇంటిమేటెడ్ సీన్స్, అందాల ఆరబోత చేస్తుంది అని అనుకున్నారు.

 

ఇక  నటుడు విజయ్ వర్మతో ప్రేమ వలన అమ్మడు కూడా బాలీవుడ్ లోనే పాగా వేయాలని ట్రై చేసింది.  అయితే ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో ఆస్థాన ఐటెంభామగా మారిపోయింది. తమన్నాకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు పోటాపోటీగా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ మొదటి వరుసలో ఉంటుంది. ఆ రేంజ్ లో డ్యాన్స్ చేయగల తమన్నా.. ఐటెంసాంగ్స్ తో మెప్పించడం మొదలుపెట్టింది.

 

ఒక స్టార్ హీరోయిన్ ఐటెంసాంగ్ చేయొచ్చు అని నిరూపించింది తమ్ము బేబీనే. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో అమ్మడి ఐటెంసాంగ్స్  నెక్స్ట్ లెవెల్ లో హిట్ అయ్యాయి.  హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలా ఐటెంసాంగ్స్ చేయడం ఎందుకు అన్న ప్రశ్నకు.. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని, హీరోయిన్ గా కంటే.. ఇలా ఒక స్పెషల్ సాంగ్స్ వలన ఆ డ్యాన్స్ ను బయటపెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చింది.

 

ఇక ఈ మధ్యకాలంలో తమ్ము స్పెషల్ సాంగ్ ఉంటే చాలు సినిమా హిట్ అని చెప్పేస్తున్నారు. స్త్రీ 2 లో ఆజ్ కీ రాత్ మజా అంటూ ఆడిపాడి అలరించింది. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలో ఈ చిన్నది స్పెషల్ సాంగ్ చేయబోతుంది. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన రైడ్ సినిమాకు సీక్వెల్ గా రైడ్ 2 వస్తున్న విషయం తెల్సిందే. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితేష్ దేశ్ ముఖ్, వాణీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

తాజాగా ఈ సినిమాలో తమన్నా ఒక ఐటెంసాంగ్ తో రాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేహరు. నషా.. నషా అంటూ సాగిన ఈ సాంగ్ లో తమన్నా అందాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ ఫుల్ సాంగ్ రేపు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ  సాంగ్ కూడా హిట్ అయితే.. సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇంకోపక్క తెలుగులో ఆమె ఓదెల 2  సినిమా చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 18 న రిలీజ్ కానుంది. మరి ఈ తమన్నాకు ఎలాంటి పేరు వస్తుందో చూడాలి.

RAID 2 | Nasha (Teaser) | Tamannaah Bhatia | Song Out Tomorrow | #RAID2 #nasha | Nasha Song Raid 2.

Exit mobile version
Skip to toolbar