Site icon Prime9

Tamannaah – Vijay Varma: లవ్‌, బ్రేకప్‌ – రిలేషన్‌షిప్‌పై తమన్నా కామెంట్స్‌!

Tamannaah avoids Reporter Question Amid Breakup Rumours: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓదెల 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రమిది. నాగసాధువుగా పవర్పుల్‌ పాత్రలో కనిపించింది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్‌ కార్యక్రమాలతో పాటు ప్రెస్‌ మీట్స్‌, ఇంటర్య్వూలో పాల్గొంటుంది. అలాగే తమన్నా కూడా ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో పాల్గొంటు సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రెస్‌లో మీట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తమన్నాకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

 

విజయ్ పై ప్రశ్న, తమన్నా రిప్లై

ఓ విలేఖరి తమన్నా బ్రేకప్‌పై పరోక్షంగా ప్రశ్నించగా.. దీనికి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. నిన్న (ఏప్రిల్‌ 8) ఓదెల 2 ట్రైలర్‌ని లాంచ్‌ ఈవెంట్‌లోని ముంబైలో ఘనంగా నిర్వహించారు. దీనికి మూవీ టీంతో పాటు తమన్నా కూడా పాల్గొంది. ఇక ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం మూవీ టీం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ఇలా ప్రశ్నించారు. మంత్ర తంత్రాలు ఉపయోగించిన మీరు ఎవరిమీదైన విజయం (హిందీలో విజయ్‌) సాధించాలనుకుంటున్నారా? అని పరోక్షంగా తన ప్రియుడు విజయ్‌తో రిలేషన్‌పై ప్రశ్నించారు. దీనికి తమన్నా స్పందిస్తూ.. మంత్ర తంత్రాలతో అలాంటి పనులు జరుగుతాయని నేను నమ్మను. ఒకవేళ అదే జరిగితే ముందు నేను మీపైనే(మీడియా) ఉపయోగిస్తాను. అప్పుడు అందరు నా చేతుల్లోనే ఉంటారు. నేను చెప్పింది వింటారు. నేను ఏం చెబితే అదే రాస్తారు” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

 

విజయ్ వర్మతో బ్రేకప్..?

కొంతకాలంగా తమన్నా-విజయ్‌ వర్మ బ్రేకప్‌ రూమర్స్‌ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు విడిపోయారంటూ జోరుగా ప్రచారం జరుతున్నా.. తమన్నా, విజయ్‌లు ఏమాత్రం నోరు విప్పడం లేదు. ఈ విషయాన్ని ఆమె నోటి నుంచే రప్పించాలని చూసిన తమన్నా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది. అయితే ఆమె సమాధానం విన్న నెటిజన్స్‌ మాత్రం.. విజయ్‌ పేరు కూడా చెప్పేందుకు తమన్నా ఇష్టపడలేదని, అయితే వారి బ్రేకప్‌ రూమర్స్‌ నిజమేనా? అంటున్నారు. అలాగే సింగిల్‌ లైఫ్‌పై తమన్నా పలు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

 

మనిషి ఎప్పుడు ఒంటరివాడే

“మనిషి ఎప్పుడు ఒంటరి వాడే. జీవితంలో మనకు ఎలాంటి సమస్యలు ఎదురైన వాటి నుంచి బయపడటానికి మనం ఎదుటి వ్యక్తులపై ఆధారపడాలనుకుంటాం. వారి సలహాలు, వారు ఇచ్చే ధైర్యం కావాలని అనుకుంటాం. కానీ, అది కరెక్ట్‌ కాదు. ఆనందం అయినా, బాధ అయినా మన చేతుల్లోనే ఉండాలి. దానికి ఎవరూ కూడా కారణం కాకూడదు. మనిషి ఎప్పుడు కూడా దేనికోసం ఇతరుల నుంచి ఏ సలహా ఆశించకూడదు. సమస్య ఏదైనా.. సమాధానం మనలోను ఉంఉంది. కాబట్టి మనిసి ఒంటరి వాడు అనే విషయాన్ని గుర్తిస్తే ఎదుటి వ్యక్తుల నుంచి వచ్చే ఇబ్బందులను నుంచి బయటపడోచ్చు” అని పేర్కొంది. బ్రేకప్‌ రూమర్స్‌ వేళ తమన్నా సింగిల్‌ లైఫ్ గురించి చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. ఆమె కామెంట్స్‌ చూస్తుంటే విజయ్‌-తమన్నా విడిపోయారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్‌.

 

 

Exit mobile version
Skip to toolbar