Site icon Prime9

Suresh Kondeti: సురేష్ కొండేటికి మరో బాధ్యత

Suresh Kondeti

Suresh Kondeti

Suresh Kondeti: సినీ జర్నలిస్ట్, సంతోషం సంస్థల అధినేత, నిర్మాత సురేష్ కొండేటినీ మరో పదవి వరించింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC)లో గతంలో ఎఫ్ఎన్సిసి కల్చరల్ కమిటీ సభ్యుడిగా, ప్రచార కమిటీకి చైర్మెన్ గా ఎఫ్ఎన్సిసి కల్చరల్ కమిటీ చైర్మెన్ గా తరువాత మేనేజ్మెంట్ కమిటీ మెంబర్‌గా, అలాగే కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన సురేష్ కొండేటి ఈసారి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో కల్చరల్ కమిటీకి అడిషనల్ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు.

దీనికి చైర్మన్ గా ఎ గోపాలరావు, కన్వీనర్‌గా ఏడిద రాజా నియమితులైయారు. ఈ మేరకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కెఎస్ రామారావు, సెక్రటరీ తుమ్మల రంగారావు చేతుల మీదుగా నియామక పత్రం సురేష్ కొండేటి అందుకున్నారు. ఈ సందర్భంగా తాను దీన్ని ఒక పదవిలా కాకుండా బాధ్యతలా చూస్తానని, కల్చరల్ కమిటీ అడిషనల్ చైర్మన్ గా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సురేష్ కొండేటి అన్నారు.

Exit mobile version