Site icon Prime9

Super Star Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న “లాల్ స‌లామ్‌” ఆగమనానికి ముహూర్తం ఫిక్స్..

Super Star Rajinikanth acting lal salaam movie release date fixed

Super Star Rajinikanth acting lal salaam movie release date fixed

Super Star Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “జైలర్”. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 600 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఇకపోతే రజినీ ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న “లాల్ స‌లామ్‌” అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ర‌జినీకాంత్ ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తుండడం గమనార్హం. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో ఐశ్వర్య మెగా ఫోన్ పట్టుకుంటుండగా..  న‌టి జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో రజినీకాంత్ ‘మొయ్దీన్ భాయ్‌’గా క‌నిపించ‌నున్నాడు. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాలీడ్ అప్‌డేట్ వ‌చ్చేసింది.

శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలకి రాబోయే డేట్ ని మూవీ యూనిట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం తెలియ‌జేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

ఈ సినిమా తర్వాత రజినీకాంత్.. జై భీమ్ మూవ్ డైరెక్టర్ జ్ఞానవేల్ డైరెక్షన్ లో.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యారు. రాబోయే ఏడాది సంక్రాంతికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో వస్తున్న ‘గుంటూరు కారం’, మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న’ఈగ‌ల్‌’. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ‘VD13’తో పాటు నాగార్జున హీరోగా న‌టిస్తున్న ‘నా సామిరంగ’ బ‌రిలో ఉన్నాయి. చూడాలి మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో అని..

Exit mobile version