Site icon Prime9

Rajini Kanth : కలిసి నటించనున్న సూపర్ స్టార్ రజినీకాంత్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. ఏమూవీ కోసం అంటే..?

super star rajini kanth and kaapil dev going to act in lal salaam movie

super star rajini kanth and kaapil dev going to act in lal salaam movie

Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు రజినీ. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. రజినీ స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి విదేశాల్లో కూడా మంచి మార్కెట్‌ ఉన్న స్టార్‌ అంటే రజినీ అనే చెప్పాలి. అయితే సూపర్ స్టార్ ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకురాలిగా తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ హీరో విష్ణు విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా విక్రాంత్, జీవిత రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది – రజినీ (Rajini Kanth)

ఇప్పుడు తాజాగా జైలర్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చాడు రజినీకాంత్. ఈ సినిమాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా నటించబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీలో ఒక గెస్ట్ రోల్ లో కపిల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టిన కపిల్ తో రజినీకాంత్ మాట్లాడుతున్న ఫోటోని రజిని షేర్ చేస్తూ.. “ఇండియాకి ఫస్ట్ వరల్డ్ కప్ తీసుకు వచ్చిన లెజెండరీ కపిల్ దేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇద్దరి లెజెండ్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూసిన నెటిజెన్స్ ఆ ఫోటోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

 

 

కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే కపిల్ దేవ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి రజినీకాంత్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటే నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ సినిమా కూడా చేస్తున్నారు. ఆ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్ వంటి భారీ తారాగణం నటిస్తుండడం విశేషం. అలానే మరోవైపు రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడం. వాటిపై వైసీపీ నేతలు  విమర్శలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Exit mobile version