Site icon Prime9

Mazaka OTT: ఈ ఓటీటీలోకే సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Mazaka Movie Locks OTT Partner: యంగ్ హీరో సందీప్ కిషన్ లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా రావు రమేష్, మన్మథుడు ఫేం అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా నేడు (ఫిబ్రవరి 26) థియేటర్లోకి వచ్చింది. లవ్, కామెడీ ఎంటర్టైనర్ గా ఓ మాదిరి అంచనాలతో నేడు థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం డివైడ్ టాక్ తో థియేటర్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీకి సంబంధించి వివరాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి.

ఈ తాజా బజ్ ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుందని టాక్. రిలీజ్ కు ముందే మంచి ఢిల్ కి మజాకా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. థియేటర్ రిలీజ్ అనంతరం నాలుగైదు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేలా ఒప్పందం జరిగిందని సినీవర్గాల నుంచి సమాచారం. దీని ప్రకారం.. ఏప్రిల్ తొలి వారం లేదా రెండో వారంలో మజాకా ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మజాకా కథ విషయానికి వస్తే

కొడుకుతో పాటు తండ్రి ప్రేమలో పడటం, ఇద్దరు అమ్మాయిల వెంట పడటం వంటి ఫన్నీ కాన్సెప్ట్ సాగే కథే ‘మజాకా’. రమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయడానికి ఇంట్లో ఆడవాళ్లు ఎవరూ లేకపోవడం పెళ్లి సంబంధాలు క్యాన్సీల్ అవుతాయి. దీంతో కొడుకు పెళ్లి కోసం రమణ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కృష్ణ, మీరా(రితూ వర్మ)తో, రమణ.. యశోద(అన్షు)తో ప్రేమలో పడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ

Exit mobile version
Skip to toolbar