Site icon Prime9

Akkineni Sumanth – Mrunal Thakur: మృణాల్ తో పెళ్లి.. ఎట్టకేలకు నిజం చెప్పిన సుమంత్

Akkineni Sumanth gices Clarity on Marriage with Mrunal Thakur: సోషల్ మీడియా వచ్చాక రూమర్స్ కు హద్దే లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో అయితే పుకార్లు వేరే లెవెల్ లో ఉంటాయి.  ఒక్కసారి కలిసి కనిపిస్తే చాలు వారి మధ్య ప్రేమ, పెళ్లి అని  వార్తలు పుట్టిస్తున్నారు.  అసలు ఇలాంటి రూమర్ ఒకటి ఉందన్న విషయం కూడా వారికి తెలియదు. కానీ, సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య అందాల భామ మృణాల్ ఠాకూర్.. అక్కినేని ఇంటి కోడలు కాబోతుందనే వార్త ఇండస్ట్రీని షేక్ చేసింది.

 

అక్కినేని హీరో సుమంత్ తో మృణాల్ ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ ను స్ప్రెడ్ చేశారు. అంతేనా వారిద్దరికి కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ.. మృణాల్ పెళ్లి అంటూ రాసుకొచ్చేశారు. ఇక తాజాగా ఈ వార్తలపై సుమంత్ స్పందించాడు. అసలు ఈ విషయం గురించి తాను అసలు వినలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుమంత్ నటించిన చిత్రం అనగనగా. ఈ సినిమా మే 15 న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

 

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్.. మృణాల్ తో పెళ్లి వార్తలను కొట్టి పడేశాడు. “ఆ ఫోటో సీతారామం సినిమా సమయంలో తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పెళ్లి అని రాస్తున్నారు. ఆ సినిమా తరువాత మేము కనీసం మాట్లాడుకోలేదు.  మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. నాకు పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇలా ఉండడమే నచ్చింది.

 

నా రొటీన్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ సమయం సినిమాలు చూస్తూనే ఉంటా. జిమ్ చేస్తా. స్పోర్ట్స్ ఆడతాను. పెళ్లి ఆలోచన రానివ్వను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. సుమంత్ హీరోగా కెరీర్ లో బిజీగా ఉన్నప్పుడే.. హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహ బంధంలో కలతలు రావడంతో వారు విడిపోయారు. ఆ తరువాత కీర్తి రెడ్డి రెండో వివాహం చేసుకోగా.. సుమంత్ సింగిల్ గానే ఉండిపోయాడు. ప్రస్తుతం సుమంత్ మంచి సినిమాలతో బిజీగా మారాడు.

Exit mobile version
Skip to toolbar