Site icon Prime9

Mohan Babu – Soundarya: సౌందర్యను చంపింది మోహన్ బాబే.. ఆమె భర్త ఏమన్నాడంటే.. ?  

Mohan Babu – Soundarya: మంచు మోహన్ బాబు గత కొన్ని నెలలుగా కొడుకుల ఆస్తి తగాదాల్లో తలమునకలు అయ్యి ఉన్నాడు. మంచు మనోజ్.. ఇంటి బయట ధర్నా చేయడం, పోలీస్ కేసు పెట్టడం.. మంచు విష్ణు ఇంకోపక్క తమ్ముడుపై దాడి చేయడం, అసలేమైందో కనుక్కోవడానికి వచ్చిన రిపోర్టర్స్ పై మోహన్ బాబు దాడి చేయడం.. ఇలా ఒకటి అని కాకుండా.. పలు వివాదాల మధ్య మోహన్ బాబు నలిగిపోతున్నాడు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. రెండు రోజుల క్రితం మోహన్ బాబుపై ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

 

ఖమ్మం జిల్లా సత్యనారాయణ పురంకు చెందిన ఎదురుగుట్ల చిట్టిబాబు అనే వ్యక్తి.. 21 ఏళ్ళ క్రితం హీరోయిన్ సౌందర్యను మోహన్ బాబే హత్య చేయించాడని, జల్ పల్లిలో ఉన్న ఫార్మ్ హౌస్ ను అమ్మమని సౌందర్య అన్న అమర్ నాథ్ ను అడగగా ఆయన ఒప్పుకోలేదని, అందుకే పగపట్టి మోహన్ బాబే.. సౌందర్య, ఆమె అన్నను చంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మోహన్ బాబు ఉంటున్న ఫార్మ్ హౌస్ ను అక్రమంగా కబ్జా  చేసి అనుభవిస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

 

మోహన్ బాబు ఉంటున్న ఇంటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ కూడా చేసాడు. రెండు రోజుల నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు మంచి కుటుంబం ఈ  ఆరోపణలపై స్పందించింది లేదు. అయితే తాజాగా సౌందర్య భర్త రఘు ఈ వార్తలపై స్పందించాడు.  సౌందర్య ఆస్తులకు మోహన్ బాబుకు ఎలాంటి సంబంధం లేదని బహిరంగ లేఖను రిలీజ్ చేశాడు.

 

“హైదరాబాద్ లో సౌందర్యకు సంబంధించిన ఆస్తుల గురించి కొన్నిరోజులుగా వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నాను. అందులో ఎలాంటి నిజం లేదు. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు స్వాధీనం చేసుకున్నాడని, కబ్జా చేసి అక్రమంగా అనుభవిస్తున్నాడని వస్తున్న వార్తలు అన్ని అసత్యాలు. ఆమె బతికున్నంతవరకు మోహన్ బాబుతో ఎలాంటి భూ లావాదేవీలు జరుపులేదు. మోహన్ బాబు కుటుంబంతో మాకు 25 ఏళ్లుగా స్నేహం ఉంది. ఆయనంటే మాకు ఎంతో గౌరవం. మేము అందరం ఒకే కుటుంబంలా ఉంటాము. మా మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు కానీ, గొడవలు కానీ లేవు. దయచేసి అసత్యాలను ప్రచారం చేయవద్దు” అని చెప్పుకొచ్చాడు.

 

ఇక రఘు ఇచ్చిన క్లారిటీతో నెటిజన్స్ కొద్దిగా చల్లబడ్డారు. మోహన్ బాబు అంత మూర్ఖుడా.. ? ఆస్తి కోసం అంత చేశాడా.. ? అంటూ అనుమలను వ్యక్తం చేసినవారికి రఘు సమాధానంతో చెక్ పడింది. ఇక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన చిట్టిబాబు పేరు కోసమో, డబ్బు కోసమో ఇలా చేసి ఉంటాడని కొందరు అనుమానిస్తున్నారు. మరి అతడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Exit mobile version
Skip to toolbar