DJ Tillu 2 : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. “డీజే టిల్లు” సినిమాతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. గత ఏడాది ఫిబ్రవరి లో రరిలీజ్ అయిన ఈ చిత్రం చ్చిన్న సినిమాగా వచ్చి ఇరు తెలుగు రాష్ట్రాలలో సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన సిద్దు, నేహా శర్మకి ఈ హిట్ తో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక తాజాగా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేయడానికి డీజే టిల్లు తెరకెక్కించిన విమల్ కృష్ణనే అనుకున్న మూవీ టీం కొన్ని కారణాలు వల్ల ఆ ప్లేస్ లో మల్లిక్ రామ్ ని ఎంపిక చేసుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు మొదటిగా శ్రీలీలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను సెలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి అనుపమ వాకౌట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అనుపమ స్థానంలో మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒక్క వీడియోతో అన్నీ రూమర్లకు చెక్..
అయితే ఇప్పటి వరకు ఈ రూమర్లపై చిత్రబృందం స్పందించలేదు. కాగా తాజాగా ఒక వీడియోతతొ అన్నీ రూమర్లకు చెక్ పెట్టారు. ఆ వీడియోలో అనుపమ, హీరో సిద్దు కర్లీ హెయిర్ ని సరి చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియోతో అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకుంది అనే వార్తల్లో నిజం లేదని ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సితార ఎంటర్టైన్మెంట్స్ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోని షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి..
Minister Ktr: అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాం- కేటీఆర్
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
అలాంటి సమయంలో తులసి మొక్కను తాకకూడదని తెలుసా
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/