Singer Sunitha Reacts on Pravasthi Aradhya Comments: పాడుతా తీయగా.. తాజా వివాదంపై సింగర్ సునీత స్పందించారు. తనతో పాటు జడ్జస్‌పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సునీత అందంగా కనిపించినంత.. మంచివారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తనపై ఎందుకో సునీత.. ఏదో గ్రజ్జ్ పెట్టుకున్నారని ఆమె వాపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఆరోపణలు సునీత స్పందిస్తూ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
‘ఊహాగానాల కంటే నిజం గెలుస్తుంది’
ఇందులో ప్రవస్తి కామెంట్స్ సునీత వివరణ ఇచ్చారు. ఇదంత తన ఊహగానం అని, తనపట్ల మేము పక్షపాతం చూపించలేదడానికి కొన్ని సంఘటనలతో సునీత వివరణ ఇచ్చారు. దీనిపై ఆమె మాట్లాడుతూ రికార్డు చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి “వ్యక్తిత్వం అనేది పుకార్ల మీద నిర్మించబడలేదు. వాటి వల్ల మన ఖ్యాతి కూడా నాశనం కాదు. ఊహాగానాల కంటే నిజం గెలుస్తుందని మేము నమ్మకంగా ఉన్నాము” అని క్యాప్షన్ ఇచ్చింది.
సునీత అందంగా కనిపించనంత మంచి వారు కాదు
కాగా సోమవారం ప్రవస్తి తన యూట్యూబ్‌లో ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ కీరవాణి, సింగర్ సునీత, గేయ రచయిత సుభాష్ చంద్రబోస్‌లు జడ్జిమెంట్ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని, తను చేయని తప్పులను కూడా క్రియేట్ చేసి నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేవారని ఆరోపించింది. ఇక సునీత అంటూ ఏకవచనంలో సంభోదిస్తూ ఆమె చాలా అందంగా ఉంటారు.. కానీ కనిపించినంత మంచి వారు కాదంటూ సంచలన కామెంట్స్ చేసింది. తను స్టేజ్‌పైకి వచ్చినప్పుడల్లా అయిష్టంతో కూడిన మొహం పెట్టేవారని,
తన పర్ఫామెన్స్ సమయంలో మైక్ ఆన్ ఉందని తెలియక.. ఈ అమ్మాయిది హైవాయిస్ కాదు..కానీ బాగా మ్యానేజ్ చూస్తుంది చూడండి’అని తనపై కీరవాణికి ఏవేవో చెప్పారంది. ఇక కీరవాణిపై కూడా ఎవరూ ఊహించని కామెంట్స్ చేసింది. ఆయన తన దగ్గర పనిచేసే వారిని చులకనగా చూస్తారని, సింగీతం నేర్చుకోవడాన్ని చాకిరి అంటూ ఎగతాళి చేశారంటూ ప్రవస్తి తన వీడియో చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహరంపై సింగర్ సునీత స్పందిస్తూ అసలు విషయం చెప్పుకొచ్చారు.