Site icon Prime9

Singer Mangli New House: సింగర్ మంగ్లీ కొత్త ఇంటి గృహప్రవేశం – ఫోటోలు వైరల్!

Singer Mangli New House Details: సింగర్‌ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓ న్యూస్‌ ఛానెళ్లలో యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత సింగర్‌గా సెటిలైపోయింది. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ పాటలు పాడుతూ సంగీత ప్రియులు అలరిస్తోంది. మరోవైపు మ్యూజిక్‌ కన్సర్ట్స్, స్టేజ్‌ పర్ఫామెన్స్‌ ఇస్తూ రెండు చేతుల బాగా సంపాదిస్తుంది. ప్రస్తుతం తెలుగు స్టార్‌ సింగర్స్‌లో ఈమె ఒకరు. ఇలా కెరీర్‌ పరంగా దూసుకుపోతున్న మంగ్లీ కొత్త ఇల్లు కొనుగోల చేసింది.

తాజాగా కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. సోమవారం ఈ కార్యక్రమం జరిగగా కేవలం కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అందులో బిగ్‌బాస్‌ ఫేం, జబర్దస్థ్‌ రోహిణి ఈ పాల్గొంది. ఇందులో సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ మంగ్లీకి విషెస్‌ తెలిపింది. దీంతో ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో బయటకు వచ్చాయి. కాగా మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్‌.

అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల హిట్‌ మూవీ ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో రాములో రాముల పాట పాడి ఆడియన్స్‌ని అలరించింది. ఈ పాటతో ఆమె పేరు మారుమ్రోగింది. ఒక్క సాంగ్‌తోనే ఆమె ఫుల్‌ క్రేజ్‌ని సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ పాడుతూ వస్తోంది. ఆ తర్వాత సారంగ దరియా (లవ్‌స్టోరీ), ఊరు పల్లెటూరు (బలగం), కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ విక్రాంత్‌ రాథోడ్‌లో ‘రారా రక్కమ్మా’ పాట పాడింది. ఈ పాటను తెలుగు, కన్నడలో ఆమె పాడటం విశేషం. ఈ సాంగ్‌ ఎంతటి క్రేజ్‌ సంపాదించుకుందో తెలిసి విషయమే. ఇక ఆమె చెల్లి ఇంద్రావతి కూడా సింగర్‌ అనే విషయం తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar