Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన గత మంగళవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. కూతురు, భర్త వేధింపుల వలనే కల్పన సూసైడ్ చేసుకోవాలనుకుందని వార్తలు వచ్చాయి.
ఇక అమ్మ ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని, గత కొంతకాలంగా అమ్మ ఇన్సోమ్నియాతో బాధపడుతుంది. వాటికోసం వైద్యులు సూచించిన మందులు వేసుకుంటూ ఉంటుంది. గతరాత్రి మోతాదుకు మించిన మందులు వేసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని కల్పన కూతురు చెప్పుకొచ్చింది. కోలుకున్నాకా కల్పన కూడా ఇదే మాట తెలిపింది.
“మా కుటుంబం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. నా భర్తతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. ఆయన నేను, నా కూతురు చాలా సంతోషంగా జీవిస్తున్నాం. నాకిప్పుడు 45 ఏళ్లు. ఈ వయసులో కూడా నేను పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నానంటే నా భర్త సహకారం వల్లే. ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం చాలా ఆన్యోన్యంగా జీవిస్తున్నాం. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ నా భర్త ప్రసాద్ ప్రభాకర్. మాకు ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది.. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా తరచూ నిద్రలేమితో బాధపడుతున్నాను. దానికి కోసం చికిత్స తీసుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చింది.
అయినా కూడా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కల్పన పర్సనల్ విషయాలను తీసుకొచ్చి.. ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు ఏంటో తెలుసా.. ? సింగర్ కల్పన లైఫ్ లో చీకటి కోణాలు అంటూ థంబ్ నెయిల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇక ఇలాంటివారిపై కల్పన మండిపడడమే కాకుండా.. తాజాగా ఆమె మహిళా కమీషన్ ను ఆశ్రయించింది.
“సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిని ఆపండి. నిజానిజాలు తెలియకుండా పోస్టులు పెడుతున్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ కల్పన.. తెలంగాణ మహిళా కమీషన్ చైర్ పర్సన్ ను కలిసి విన్నవించుకుంది. ఆమె కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై కరీనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మహిళపై ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టినా.. ట్రోల్స్ చేసినా ఊరుకొనేది లేదని, అలాంటివారిపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.