Shreya Ghoshal Twitter Hacked: ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని అలర్ట్ చేసింది. ఆమె ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీని ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైందని చెప్పారు. “నా అభిమానులు, స్నేహితులకు ఒక విజ్ఞప్తి. ఫిబ్రవరి 13వ తేదిన నా ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయమైన ఎక్స్ సంస్థకు రిపోర్టు చేసేందుకు ప్రయత్నించా.
కానీ, ఆటో జనరేటెడ్ రెస్పాన్స్‌ల ద్వారా నాకు ఎలాంటి పరిష్కారం దొరకం లేదు. అకౌంట్‌ని డిలీట్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ కావడం లేదు. కనీసంనా ఖాతా లాగిన్ అవ్వడానికి కూడా వీలు లేకుండా పోయింది. దయచేసి నా ఖాతా నుంచి వచ్చే ఎలాంటి పోస్ట్స్, లింక్స్‌ని క్లిక్ చేయకండి. అదే విధంగా అందులో వచ్చే స్పామ్ మేమేజ్‌లకు రెస్పాండ్ అవ్వకండి. నా అకౌంట్ రికవరి అయిన వెంటనే ఈ విషయాన్నీ మీకు తెలియజేస్తాను.
అప్పటి వరకు ఎవరూ ఈ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి పోస్ట్స్‌కి స్పందించకండి” అని రాసుకొచ్చారు. కాగా శ్రేయా ఘోషల్ గరించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలుగా తన మధుర గాత్రం సంగీత ప్రియులను అలరిస్తున్నారు. బాలీవుడ్ సింగర్ అయిన ఆమె హందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతి, మరారీలో ఇలా ఎన్నో భాషల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్‌గా కొనసాగుతున్నారు. ఆమె పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాయి. సింగర్‌గానూ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకోవడం విశేషం.