Site icon Prime9

Shivraj Kumar “Ghost”: శివరాజ్ కుమార్ ’ఘోస్ట్‘ పోస్టర్ విడుదల

GHOST

GHOST

Shivraj Kumar Ghost:  శాండల్ వుడ్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు ఘోస్ట్ 28 రోజుల పాటూ సాగిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ ఇంటీరియర్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంది.

మొదటి షెడ్యూల్ కి సంబందించిన మేకింగ్ స్టిల్స్, వీడియో విడుదల చేశారు మేకర్స్. డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. టీం శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. గన్ తన అధికారం అన్నట్టుగా పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివన్న తో ఉన్న ఘోస్ట్ న్యూ పోస్టర్ అంచనాలు పెంచుతోంది. ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని నిర్మిస్తున్నారు.

Exit mobile version