Shine Tom Chacko Explanation on Escaping From Hotel: డ్రగ్ కేసులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసి శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోలీసుల విచారణ షైన్ టామ్ చాకో కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగించేవారు ఎంతోమంది ఉన్నప్పటికి తరచూ తన పేరే ఎందుకు బయటకు వస్తుందో తెలిపినట్టు తెలుస్తోంది. ‘డ్రగ్స్ సరఫరా చేసేందుకు కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు.. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రగ్స్ తీసుకుని వచ్చేవారు.
అడిగితే సినిమా సెట్స్‌కూ కూడా తీసుకుని వచ్చి ఇచ్చేవారు’ అని పోలీసులతో చెప్పినట్టు స్థానిక మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అనంతరం పోలీసులు ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధినం చేసుకున్నారట. బ్యాంక్ లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. షైన్ టామ్ చాకో అకౌంట్ నుంచి చిన్న మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. అవి ఎవరీ అకౌంట్స్, ఎవరేవరికి ఇందులో సంబంధం ఉందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్లో షైన్ టామ్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్‌కి చేరుకుని పోలీసులు సోదాలు నిర్వహించారు.
అయితే అప్పటి విషయం తెలుసుకున్న షైన్ హోటల్ నుంచి పరారయ్యాడు. మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తు కిటికిపై దూకి అక్కడి నుంచి పారిపోతున్న ద్రశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారం పోలీసులు షైన్ టామ్ చాకోను అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులు ప్రశ్నించగా.. తాను ఓ నటిని కలవడానికి వచ్చానని పోలీసులు చెప్పినట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ సినిమా విషయంలో చిత్రబ్రందంతో తనకు విభేదాలు వచ్చాయని, గొడవపడేందుకు వారు తనకోసం ఆ హోటల్‌కు వచ్చారని భావించి తాను అక్కడి నుంచి పారిపోయానని చెప్పినట్టు సమాచారం. ఇక మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలతో తనకు సంబంధం లేదని, తనతో ఎప్పుడు తాను అసభ్యంగా ప్రవర్తించలేదని పోలీసులకు స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తోంది.