Site icon Prime9

Ashwini Nambiar: ఆ డైరెక్టర్ అలా చేయడంతో నిద్రమాత్రలు మింగాను.. చిరు రీల్ చెల్లి షాకింగ్ కామెంట్స్

Ashwini Nambiar: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పువ్వులతో స్వాగతం పలుకుతారు.. ముళ్లతో గుచ్చుతూ ఉంటారు. అన్నింటికీ సిద్దమైతేనే ఈ రంగంలో అడుగుపెట్టాలి. ఈ జనరేషన్ లో ఇలాంటివి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఒకప్పుడు నటించిన హీరోయిన్స్.. మరీ 13, 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారు. వారికి నటించడం తప్ప ఏది తెలిసేది కాదు. వారి అమాయకత్వాన్ని కొందరు అలుసుగా తీసుకొని లైంగిక వేధింపులకు గురిచేసేవారు.

 

తాజాగా సీనియర్ నటి అశ్వినీ నంబియార్ తన చిన్నతనంలో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ను బయటపెట్టింది. అశ్విని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎన్నో సీరియల్స్ లో కూడా నటించింది. పెళ్లి తరువాత సింగపూర్ లో సెటిల్ అయిన ఆమె  ఈ మధ్య  అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సుడల్  2 సిరీస్ లో.. మాలతీ అమ్మగా నటించి మెప్పించింది.

 

తాజాగా అశ్వినీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు ఒక మలయాళ డైరెక్టర్ తనను లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ” ఒకరోజు ఒక మలయాళ డైరెక్టర్ సినిమా గురించి మాట్లాడాలని ఆఫీస్ కు రమ్మన్నాడు. అప్పుడు నేను ఇంకా టీనేజర్ నే. ఎక్కడకు వెళ్లినా నన్ను అమ్మనే తీసుకెళ్తుంది. ఆరోజు కూడా అమ్మ రావాల్సి ఉంది. కానీ, ఆమెకు ఆరోగ్యం బాలేదని, హెయిర్ డ్రెస్సర్ ను తోడుగా ఇచ్చి పంపింది.

Rukshar Dhillon: అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు.. చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు

ఆ డైరెక్టర్ ఇల్లు, ఆఫీస్ ఒకేచోట ఉన్నాయి. లోపలి గెంతుకుంటూ వెళ్ళిపోయాను. అంతకుముందు ఆ డైరెక్టర్ తో ఒక సినిమా చేశాను. అందుకే ఆ చనువుతో అయన దగ్గరకు వెళ్ళిపోయాను. అతనిది నా తండ్రి వయస్సు. నన్ను చూడగానే ఇటు రా అని పిలిచి.. తాకరానిచోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తరువాత నా ముఖంలో నవ్వు మాయమైంది. వెంటనే నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగినదంతా అమ్మకు చెప్పాను.

 

మా అమ్మ తాను రాకపోవడం వలనే ఇలా జరిగింది అనుకోని బాగా ఏడ్చింది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. నేను చనువు ఇవ్వడం వలనే ఇది జరిగింది.. నా వలనే మా అమ్మ ఏడుస్తుంది అనుకోని.. ఆ రాత్రి నిద్రమాత్రలు మింగి చనిపోవాలనుకున్నాను. వెంటనే నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి బతికించారు. అప్పుడు అమ్మ.. అది నా వలన జరగలేదని నెమ్మదిగా చెప్పింది. నాకు నువ్వంటే ప్రాణం.. ఇలా చేయకు అని చెప్పింది.

ఆ ఇన్సిడెంట్ తరువాత నాకు నేను దైర్యం చెప్పుకున్నాను. ఇలాంటివి చేస్తే అమ్మ బాధపడుతుంది. అందుకే అప్పటినుంచి స్ట్రాంగ్ అయ్యాను. చాలాసార్లు ఒంటరిగా కూడా వెళ్లేదాన్ని. పెళ్లి తరువాత సింగపూర్ కు వెళ్ళిపోయాను. చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, సింగపూర్ నుంచి చెన్నై వచ్చిపోలేను అని రాలేదు. అక్కడే ఒక కాలేజ్ లో  లెక్చరర్ గా పని చేశాను.

 

ప్రస్తుతం నా కూతురు కాలేజ్ లో చదువుకుంటుంది. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వొచ్చు అనిపించింది. ఆ సమయంలోనే సుడల్ అవకాశం వచ్చింది. డైరెక్టర్స్ పుష్కర్ అండ్ గాయత్రీ నాకు ముందు నుంచి తెలుసు. వెంటనే ఒప్పేసుకున్నాను. ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి” అని చెప్పుకొచ్చింది.

Exit mobile version
Skip to toolbar