Site icon Prime9

Sankranthiki Vasthunam: ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ – రెండు రోజుల్లోనే రికార్డు వ్యూస్‌.. ఎంతంటే!

Sankranthiki Vasthunam Record Views in OTT: విక్టరి వెంకటేష్‌ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్‌పోస్టర్‌ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌ అనిపించుకుంది. బాక్సాఫీసు వద్ద రూ. 300పైగా వసూళ్ల దండయాత్ర చేసింది. ఇక ఈ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకుని ఇప్పటికీ 94 సెంటర్లలో సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతుంది.

అలాగే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. అదే రోజు టీవీలోనూ ప్రసారం అయ్యింది. మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటరల్లో సత్తాచాటిన ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ప్రముఖ జీ సంస్థ డిజిటిల్‌, శాటిలైట్‌ హక్కులను తీసుకుంది. మూవీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో భారీ ధరకు మూవీ రైట్స్‌ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రోటిన్‌గా కాకుండా ఈ సినిమా టీవీ, ఓటీటీలో ఒకేరోజు విడుదల చేసి ట్రెండ్‌ సెట్‌ చేసింది.

ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతున్న ఓటీటీలో కూడా అదరగొడుతోంది. స్ట్రీమింగ్‌కి వచ్చిన 6 గంటల్లోనే మిలియన్ల ఆల్‌ టైం రికార్డు ఓపెనింగ్‌ వ్యూస్‌ని జీ5 అందుకుంది. 12 గంటల్లో 1.3 మిలియన్‌కి పైగా వ్యూస్‌ పర్‌ మినిట్‌గా రికార్డు బ్రేక్‌ చేసింది. క్రియేట్‌ చేసింది. వన్‌ డేలో ఈ సంక్రాంతికి వస్తున్నాం 100 మిలియన్‌ మినిట్‌ పర్‌ మినిట్‌ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇక రెండు రోజుల్లో ఈ సినిమా 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ పర్‌ మినిట్‌ సాధించి zee5లో ఈ రేంజ్‌లో వ్యూస్‌ సాధించిన తొలి సినిమాగా కూడా సంక్రాంతికి వస్తున్నాం ఆల్‌ టైం రికార్డు సెట్‌ చేసింది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ జీ5 అత్యధిక వ్యూస్‌తో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Exit mobile version
Skip to toolbar