Site icon Prime9

Sandeep Reddy Vanga: హీరో లేకుండా సినిమా తీస్తా: సందీప్‌ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga Latest Comments: డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోల రేంజోలో ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందనడంలో సందేహం లేదు. తొలి చిత్రం అర్జున్‌రెడ్డితోనే తెలుగు, హిందీలో తనకంటూ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఇక యానిమల్‌తో సందీప్‌ రెడ్డి వంగా పేరు నేషనల్‌ వైడ్‌గా మారుమోగింది. చూడటానికి సైలెంట్‌గా, కూల్‌గా కనిపించే సందీప్‌లో ఇంత ఫైర్‌ ఉందా? అని అంతా ఆశ్చర్యపోయేలా యానిమల్‌ తెరకెక్కించారు. బోల్డ్‌ అండ్‌ వైల్డ్‌ యాక్షన్‌ చిత్రాలకు కెరాఫ్‌గా మరారు.

అయితే ఆయన సినిమాలకు ఎంతటి ఫాలోయింగ్‌ ఉందో అదే స్థాయిలో విమర్శించే వారు కూడా ఉన్నారు. అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయినప్పుటికీ.. ఇప్పటికీ వాటిని తప్పుబట్టేవారున్నారు. ఆయన సినిమాల వల్ల సమాజాని ఏం ఉపయోగం లేదనే నెగిటివ్‌ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మహిళా సంఘాల నుంచి ఆయన చిత్రాలకు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన సినిమాల్లో స్ట్రీని తక్కువ చేసి చూపిస్తారంటూ విమర్శ కూడా ఉంది. అయితే తాజాగా దీనిపై ఆయన స్పందించారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఇందులో తనపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్, విమర్శలపై స్పందించారు.

మీరు పాటలు లేకుడా సినిమా తీస్తారా? హీరో లేకుండా సినిమా తీస్తారా? యాంకర్‌ ఆయనను ప్రశ్నించగా.. తాను హీరో లేకుండానే సినిమా తీస్తానన్నారు. “ఒకవేళ నేను హీరో లేకుండా సినిమా తీసినా.. నా చిత్రాలను విమర్శించే మహిళలు దాన్ని కూడా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. నాలుగైదు ఏళ్లలో కేవలం మహిళలతోనే సినిమా తీసి చూపిస్తా. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారంత ‘అప్పుడు ఐదేళ్ల క్రితం సందీప్‌ చెప్పంది చేసి చూపించాడు’ అని మాట్లాడుకుంటారు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ స్పిరిట్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సందీప్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే ఇంటర్య్వూలో స్పిరిట్‌ కలెక్షన్స్‌ గురించి యాంకర్‌ ప్రశ్నించారు. స్పిరిట్‌ మూవీ రూ. 2వేల కోట్ల కలెక్షన్స్‌ చేస్తుందంటున్నారు మీరేమంటారు అని అడగ్గా.. ఈ సినిమా రికార్డులు బాహుబలి దాటి ఉండాలని తాను అనుకోవడం లేదన్నారు. రూ. 2000 కోట్లు అనేది చాలా పెద్ద విషయమన్నారు. అయితే స్పిరిట్‌ మాత్రం చాలా మంచి సినిమా అని, ఇక మూవీ వసూళ్లు విషయానికి వస్తే అది ఆడియన్స్‌ చేతుల్లో ఉందంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar