Samantha’s Citadel Honey Bunny Bags A Nomination At Critics Choice Awards: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ, బన్నీ’. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిరోజు నుంచే ఈ సిరీస్‌కు సూపర్ హిట్ టాక్ రావటంతో ఓటీటీలోనూ నంబర్ 1గా నిలుస్తోంది.
మరోవైపు, ఈ సిరీస్ ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ చాయిస్ అవార్డుకు నామినేట్ కావటంతో బాటు ఉత్తమ విదేశీ భాష సిరీస్‌లో చోటు దక్కించుకుంది. ఈ అవార్డుపై డెరెక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. 2025 జనవరి 12న ఈ అవార్డుల వేడుక జరగనుందని వారు సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనిపై సమంతా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.