Site icon Prime9

Samantha Dating Rumours: ఆ డైరెక్టర్‌తో డేటింగ్‌ వార్తలు! – తిరుమలలో రాజ్‌ నిడిమోరుతో కలిసి సమంత మొక్కులు? వీడియో వైరల్‌

Samantha Visits Tirumala With Director Raj Nidimoru: స్టార్‌ హీరోయిన్‌ సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ రోజు(శనివారం) తిరుమలతో పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సమంత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన నిర్మాణం సంస్థ రూపొందుతున్న శుభం మూవీ టీం కూడా స్వామిసేవలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శన ఏర్పాట్లు చేశారు.

 

తిరుమలలో సమంత, డైరెక్టర్

అనంతరం వేద పండితులు ఆశీర్వాదాలు, స్వామి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం సమంత తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే సమంతతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరు కూడా ఉన్నారు. మొక్కల సమయంలో సమంత చుట్టుపక్కలే ఆయన ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సమంత విడాకుల తర్వాత సింగిల్‌గా నివసిస్తుంది. ఈక్రమంలో ఆమె ఎన్నో ట్రోల్స్‌, అనారోగ్య సమస్యలతో సవాళ్లతో కూడుకున్న జీవితాన్ని గడుపుతోంది. ఈ నేపథ్యంలో సమంత ఆద్యాత్మికమైన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఖుషి తర్వాత సామ్‌ తెలుగులో ఎలాంటి సినిమా సైన్‌ చేయలేదు.

 

ఆయనతోనే వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు

కానీ, బాలీవుడ్‌లో వరుసగా వెబ్‌ సిరీస్ లు చేస్తుంది. అది కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ల డైరెక్టర్స్‌తోనే ఆమె అక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. వీరి డైరెక్షన్‌లో వచ్చిన సిటాడెల్‌ హనీ బన్నీలో నటించింది. నెక్ట్స్‌ సమంత నటిస్తున్న రక్త్‌ బ్రహ్మాండ్‌ కూడా వీరి దర్శకత్వంలోనే రూపొందుతుంది. అంతేకాదు సమంత కూడా ఎక్కువగా బి-టౌన్‌లోనే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందంటూ, ఆయనను రెండో పెళ్లి చేసుకోబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

వారి మధ్య ఏముంది?

అంతేకాదు వీరిద్దరు ఎక్కడ కనిపించిన వారి ఫోటోలు, డేటింగ్‌ వార్తలు హైలెట్ అవుతున్నాయి. అయినప్పటి సమంత ఎప్పుడు ఈ వార్తలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సమంత, రాజ్‌ నిడిమోరులు తిరుమలలో కనిపించడంతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నెట్టింట చర్చ జరుగుతుంది. సమంత ఎక్కడికి వెళ్లిన రాజ్‌ ఆమెతోనే కనిపిస్తున్నారు, అసలు వీరిద్దరి మధ్య ఏముంది? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సామ్‌ అభిమానులు మాత్రం వారిద్దరు మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య స్నేహం మాత్రమే ఉందంటున్నారు. మరి ఈ వార్తలకు సమంత ఎలాంటి చెక్‌ పెడుతుందో చూడాలి.

Exit mobile version
Skip to toolbar