Site icon Prime9

Samantha: దానికి నా జీవితంలో స్థానం లేదు – నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత రియాక్షన్‌

Samantha Comments on Naga Chaitanya-Sobhita Wedding: తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత స్పందించింది. రీసెంట్‌గా ఆమె ఓ నేషనల్‌ మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు విడాకులు, మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం సమంత తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇటూ పర్సనల్, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఎన్నో ఒడుదుడుకులు చూస్తోంది. నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధి ఆమెను వెంటాడాయి. ఇప్పటి సమంత మయోసైటిస్‌ నుంచి పూర్తి బయట పడలేదు. తరచూ ఆమె అనారోగ్యం బారిన పడుతోంది.

అలాగే మాజీ భర్త నాగచైతన్య జ్ఞపకాలను కూడా మరిచిపోలేక తరచూ ఎమోషనల్‌ అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల నాగ చైతన్య నటి శోభితను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సమంత ఎలా రియాక్ట్‌ అవుతుందా? ఆమె నుంచి వచ్చే స్పందన కోసం నెటిజన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమం సమంత తన మాజీ భర్త మ్యారేజ్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. విడాకుల తర్వాత దాని నుంచి బయటకు వచ్చి జీవితాన్ని కొనసాగించడానికి ఏం చేశారు అని యాంకర్‌ ప్రశ్నించారు

దీనికి సామ్‌ స్పందిస్తూ.. “నిజానికి దాని నుంచి బయట పడటానికి చాలా కాలం పట్టింది. దానిక నుంచి బయటకు వచ్చి జీవితంలో ముందుకు వెళ్లేందుకు చాలా శ్రమించాను” అని చెప్పుకొచ్చింది. అనంతరం తన మాజీ భర్త నటి శోభితను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినందుకు అసూయ పడుతున్నారా? అని అడిగారు.  దీనికి సమంత.. “నా జీవితంలో అసూయ అసలుస్థానం లేదు. దానిని నా జీవితం భాగం కావడానికి కూడా అంగీకరించను. ఎందుకంట అసూయే అన్ని అనర్ధాలకు, చెడుకు మూలమని అభిప్రాయపడతాను.

అలాంటి వాటిని పద్దగా పట్టించుకోను” అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో తన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ ప్రమోషన్స్‌లో సమంత తన మాజీ భర్తకు ఇచ్చిన బహుమతులపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో అవసరం లేకపోయినా అత్యధిక మొత్తం దేని కోసం ఖర్చు పెట్టావు? అని వరుణ్‌ ధావన్‌ ప్రశ్నించగా.. నా ఎక్స్‌కి ఇచ్చిన గిఫ్ట్స్‌ అని టక్కున సమాధానం ఇచ్చింది. ఎంత అయ్యి ఉంటుందని అడగ్గా.. కాస్త ఎక్కువే అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

Exit mobile version
Skip to toolbar