Samantha on Hospital Bed Photo Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యం బారిన పడింది. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో తను ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో కనిపించడంతో అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామ్ ఏమైందా? అని వారంత ఆరా తీస్తున్నారు. కాగా సమంత సినిమాల్లో కనిపించి చాలా కాలం అవుతుంది. తెలుగులో చివరిగా ఖుషిలో నటిచింది. ఆ తర్వాత ఆమె సిటాడెల్: హనీ బన్నీ అనే యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది ఇక్కడ అంత గుర్తింపు తెచ్చుకోకపోయిన విదేశాల్లో ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం సామ్ చేతిలో తెలుగు సిమాలేవి లేవు. నటిగా కాస్తా బ్రేక్ తీసుకున్న సామ్ నిర్మాతగా మారిది. త్రలాలా పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తుంది. నినే ‘శుభం’ సినిమాని కూడా ప్రకటించింది. అయితే తాజాగా సామ్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేరింది. ఇందులో ఆమె చిల్ అవుతూ, పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ, మరికొన్ని అలా సరదగా బయటకు వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది. దాదాపు 16 ఫోటోలు షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్ ఇస్తూ తన జర్నీని వివరించింది. అలాగే తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఫోటోని కూడా షేర్ చేసింది. ఇందులో సామ్ బెడ్‌పై పడుకుని చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ కనిపించింది.
ఈ ఫోటోకి రికవరి అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే సామ్‌ని ఇలా మరోసారి ఆస్పత్రి బెడ్‌పై చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇంకా తను పూర్తి కోలుకోలేదా! అని వాపోతున్నారు. అయితే ఇది ఇప్పటి ఫోటో కాదనేది ఆమె ఫోస్ట్ చూస్తే స్పష్టం అవుతుంది. కాగా సమంత విడాకులు తర్వాత ఎన్నో ఆటూపోట్లు చూస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఓ యుద్దంలా సాగుతుంది. ఓ వైపు విడాకుల బాధ మరోవైపు అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతున్నాయి. అయినా సామ్ ఇన్ని కష్టాల్లో ధైర్యంగా నిలబడి ముందుకు సాగుతుంది. శాకుంతలం మూవీ టైంలో ఆమె మోయోసైటిస్ అనే వ్యాదితో బాధపడుతున్నట్టు తెలిపింది. అప్పటి నుంచి ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుది. ఖుషి మూవీతో లాంగ్ గ్యాప్ తీసుకుని విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుని కోలుకున్న సంగతి తెలిసిందే.