Prime9

Samantha Emotional: తండ్రి చనిపోయినా.. నవ్వుతూ ఆ పని చేసిన సామ్!

Samantha Emotional about Her Father Death: సెలబ్రిటీస్ కు కుటుంబం ఎంత ముఖ్యమో అభిమానులు కూడా అంతే ముఖ్యం. సినిమా కోసం ఎంత బాధను అయినా దిగమింగి పైకి నవ్వుతూ కనిపిస్తారు. షూటింగ్ సమయంలో సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులను కోల్పోయినా కూడా ఆ బాధను దిగమింగి.. నిర్మాతలకు నష్టం రాకుండా షూటింగ్ చేసిన సందర్భాలను ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు.  తాజాగా స్టార్ హీరోయిన్ సమంత సైతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నట్లు తెలిపింది.

 

సామ్ శుభం సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో తాను ఎదుర్కున్న ఒక ఎమోషనల్ సంఘటనను అభిమానులతో పంచుకుంది. అభిమానులను ఆమె ఎంత ప్రేమిస్తుందో ఈ ఘటనతో తెలుస్తోంది. ఈ మధ్యనే సామ్ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసే సమయానికి ఆమె ముంబైలో ఉంది. తల్లి ఫోన్ చేసి చెప్పగానే షాక్ అయ్యిందట. గత కొంత కాలంగా సామ్. తన తండ్రితో మాట్లాడడం లేదట.

 

చివరగా తండ్రితో మాట్లాడకుండానే ఆయన మరణించడం తనను చాలా బాధించిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ సమయంలోనే ఏడుస్తూ వస్తుంటే అభిమానులు తనను ఫోటోలు అడిగారని.. వారికి ఫొటోలు ఇవ్వడం కోసం ఏడుపును దిగమింగి నవ్వుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం.ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

అభిమానులపై సామ్ కి ఉన్న ప్రేమ అలాంటిది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సామ్ కెరీర్ గురించి చెప్పాలంటే.. వరుస సినిమాలతో బిజీగా మారింది. నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్.. హీరోయిన్ గా మరోసారి హిట్ అందుకుంటుందేమో చూడాలి.

 

Exit mobile version
Skip to toolbar