Prime9

Samantha – Amala on Awards: ఒకే ఈవెంట్‌లో మాజీ అత్త-కోడలు.. సమంతపై అమల ప్రశంసలు

Samantha – Amala Akkineni attends Apsara Awards Event: హీరోయిన్‌ సమంత నిర్మాతగా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. ట్రాలాల మూవీ పిక్చర్స్‌ పేరుతో సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ స్టార్‌ చేశారు. తొలి సినిమా శుభం అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆమె తాజాగా ప్రముక మీడియా, టెలివిజన్‌ స్థంస్థ నిర్వహించిన అప్సర అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే ఈవెంట్‌కి ఆమె మాజీ అత్త, నాగార్జున భార్య అమల హాజరయ్యారు.

 

ఈ మాజీ అత్త కోడళ్లు ఒకే ఈవెంట్‌లోకి పాల్గొనడంతో ఆసక్తిని సంతరించుకుంది. కాగా సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమె కెరీర్‌లో సమంత ఎన్నో హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకుంది. ఎంతోమంది అగ్ర హీరో సరసన నటించింది. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఆమెను అప్సర అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అమల అక్కినేని, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, రమ్యక్రష్ణ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా సమంత సినీ జర్నీని ఏవీ రూపంలో వేయగా.. సామ్‌ ఎమోషనల్‌ అయ్యింది. అనంతరం ఆమె స్టేజ్‌పై మాట్లాడుతూ టాలీవుడ్‌ పరిశ్రమను కొనియాడింది. తెలుగు ఇండస్ట్రీ నాకు ఎన్నో ఇచ్చింది. ఇదే నా కర్మ భూమి.. నా ప్రతి అడుగులో తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ ముందుచ్చుతానని హామీ ఇస్తున్నా” అంటున్న సమంత కామెంట్స్‌ చేసింది. ఈ సందర్బంగా సమంత మాటలకు అక్కడున్న వారంత ప్రశంసిస్తూ చప్పట్లతో ఆమె ప్రైజ్‌ చేశారు. అలాగే మాజీ అత్త అమల కూడా మాజీ కోడలు సమంత మాటలకు ఫిదా అయ్యింది. ఆమె వ్యాఖ్యాలను స్వాగతిస్తూ సమంత సక్సెస్‌ని కొనియాడుతూ ఆమె కూడా చప్పట్లు కొట్టింది.

 

Celebrating 15 Years Of Samantha Promo | Apsara Awards 2025 | This Saturday at 5:30PM | Zee Telugu

ఇందుకు సంబంధించిన ప్రొమో తాజాగా విడుదల కాగా.. దీనికి సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ‘ఏం మాయ చేశావే’ సినిమాతో సమంత టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బృందావనం, దూకుడు, సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి, రంగస్థలం, జనతా గ్యారేజ్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేశారు. తెలుగులోనే కాదు దక్షిణాది భాషలతో పాటు హిందీ వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి పాన్‌ ఇండియా నటిగా గుర్తింపు పొందారు.

 

Exit mobile version
Skip to toolbar