Site icon Prime9

Salman Khan Receives Death Threat: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం.. సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

Bollywood Hero Salman Khan gets fresh Death Threat: కొంతకాలంగా బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తాంటూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. కారులో బాంబు పెట్టి సల్మాన్‌ను పేల్చేస్తామంటూ వర్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు తాజాగా ఒక వాట్సాప్‌ సందేశం వచ్చింది.

 

ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటూ కారులో బాంపు పెట్టి పేల్చేస్తామని ఈ మెసేజ్‌లో దుండగులు పేర్కొన్నారు. ఇది సందేశం గురించి తెలుసుకున్న ముంబై పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని, ఎవరూ పంపారు అనే దానిపై విచారణ జరుపుతున్నారు.

 

 

1998లో కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ దోసిగా తేలిన సంగతి తెలిసిందే. తాము దైవంగా భావించే కృష్ణ జింకను చంపినందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ సల్మాన్‌ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి సల్మాన్‌ను చంపేస్తామంటూ తరచూ ఆయనకు హెచ్చరిక చేస్తున్నారు. ఈ క్రమంలో 2024లో ఆయన ఇంటి ముందు రెక్కీ వేసి సల్మాన్‌ గెలాక్సీ అపార్టుమెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది.

 

ఇక మహారాష్ట్ర మంత్రి బాబ సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు హత్య బెదరింపు మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో సల్మాన్‌ తన భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా విదేశాల నుంచి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారు కోనుగోలు చేశారు. అలాగే తన ఇంటి బాల్కానీకి బుల్లెట్‌ ఫ్రూవ్‌ మిర్రర్‌ని అమర్చుకున్నారు. అలాగే బహిరంగ సమావేశాలకు, సినిమా ఈవెంట్స్‌కి సల్మాన్‌ హాజరవ్వడం లేదు. ఎక్కువ శాతం సల్మాన్‌ ప్రైవేట్‌ లైఫ్‌నే గడుపుతున్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన వై కాటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

Exit mobile version
Skip to toolbar