Kantara Movie : రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం “కాంతారా”.
ఈ మూవీ లో రిషబ్ శెట్టికి జోడీగా సప్తమి గౌడ నటించి మెప్పించింది.
హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
చిన్న సినిమాగా రిలీజయ్యి కన్నడలో విజయం సాధించిన అనంతరం దేశమంతటా విడుదల అయి భారీ విజయం సాధించింది.
కాంతార సినిమాని ప్రేక్షకులతో పాటు అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు.
ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కాంతార సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
చిత్ర నిర్మాత కూడా దీనికి పార్ట్ 2 ఉంటుందని చెప్పారు.
దీంతో అంతా కాంతార సినిమాకి నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
రాబోయేది కాంతారా (Kantara Movie) సీక్వెల్ కాదుisha ప్రీక్వెల్
అయితే తాజాగా ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంతార సీక్వెల్ పై హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఇప్పుడు వచ్చిన కాంతార సినిమాకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ చెయ్యబోతున్నాము అని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
మీరు చూసింది కాంతార 2. త్వరలో కాంతార 1 తీస్తాను అని వెల్లడించారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
దీంతో ప్రేక్షకులు ఇప్పుడు చూసింది కాంతార 2నా అనుకుంటూ మరి కాంతార 1లో ఏం స్టోరీ చూపిస్తారో అని ఎదురు చూస్తున్నారు.
చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తెలుగు, హిందీ భాషలలో కూడా ఈ మూవీ భారీ హిట్ అందుకుంది.
ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించారు.
కర్ణాటకలో ప్రాచీన సంప్రదాయమైన భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలోని ప్రధానంగా వరాహం సాంగ్, క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.
ముఖ్యంగా చివరిలో రిషబ్ శెట్టి నటనకి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. పర్ఫామెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించేశాడు.
కాంతారా ప్రీక్వెల్ కోసం కేవలం కన్నడ అభిమానులే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి బజ్ ఏర్పడింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/