Site icon Prime9

Biggboss 6: బిగ్‌బాస్‌హౌస్‌లో రెండోసారి కెప్టెన్‌ గా రేవంత్‌

biggboss-revanth

Biggboss 6 Telugu: సూపర్‌ స్టార్‌ కృష్ణకు బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం వహించారు. ఇంకో వైపు ఈ వారం ఎలిమినేట్ అయ్యదే తనే అని మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. ఎందుకంటే నవంబర్‌ 29న తన వెడ్డింగ్‌ యానివర్సరీ, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్‌ చేసుకోవాలని ఉందని చెప్పింది. బిగ్‌బాస్‌ లోపల అయినా బయట అయినా కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకోసం నువ్వే ఏదో ఒకటి చేయాలని బిగ్‌బాస్‌ను వేడుకుంది మెరీనా. దాంతో బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్‌ మెరీనాకి చురకలేశాడు.

తరువాత బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌ ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌ లో పోటీదారులు శ్రీహాన్‌, రేవంత్‌, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్‌ ఇతరుల గోల్‌ పోస్ట్‌లోకి బంతి వేయాలి. ఫస్ట్ రౌండ్‌కు ఫైమా సంచాలకుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌ లో రేవంత్‌, శ్రీహాన్‌ కలిసి ఆడినట్లే కనిపించింది. అప్పుడు ఫైమా, అందరూ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఆయన చేసేదేంటని సెటైర్లు వేసింది. ఫస్ట్ రౌండ్‌లో రోహిత్‌ అవుట్‌ అయ్యాడు. రెండో రౌండ్‌లో ఎవరూ అవుట్‌ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. దాంతో ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్‌ అయ్యాడు.

ఫైమా, రేవంత్‌ గేమ్‌ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. రేవంత్‌ నీలాగా సపోర్ట్‌ తీసుకుని ఆడను అని ఫైమాను ఉద్దేశించి అన్నాడు. దాంతో ఆదిరెడ్డి బ్రెయిన్‌ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని రేవంత్‌ కి కౌంటరిచ్చాడు.దాంతో సైలెంట్‌ అయిపోయాడు రేవంత్‌. ఇక మూడో రౌండ్‌లో ఇనయ తనను తాను సేవ్‌ చేసుకోవడానికి చాలా కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్‌ కాలేకపోయానని ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్‌, శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌ అయ్యాడు. హౌస్‌లో రెండోసారి కెప్టెన్‌ అవడంతో రేవంత్‌ ఆనందపడ్డాడు.

Exit mobile version
Skip to toolbar