Site icon Prime9

Ravi Teja Mass Jathara: ‘మాస్‌ జాతర’ సాంగ్‌ ప్రొమో – ఇడియట్‌ సాంగ్‌, స్టెప్‌ రీక్రియేట్‌ చేసిన రవితేజ

Ravi Teja Mass Jathara First Song Promo: మాస్‌ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘మాస్‌ జాతర’. మనదే ఇదంతా అనేది ట్యాగ్‌ లైన్‌. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మాస్‌ జాతర నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు ఇటీవల మూవీ టీం ప్రకటించింది. తు మేరా లవర్‌ అంటూ సాగే ఈ పాట ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే ఇందులో రవితేజ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇడియన్‌లోని ఫేమస్‌ సాంగ్‌ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటకు రీమిక్స్ చేసి రూపొందించారు.

 

పాట మాత్రమే కాదు ఇందులో హుక్‌ స్టేప్‌ను కూడా రిలీట్‌ చేశాడు. ఇది చూసి అభిమానుల్లో మరింత జోష్‌ పెరిగింది. అదే ఎనర్జీతో రవితేజ ఈ స్టెప్‌ రిపీట్‌ చేసి 2002నాటి ఇడియట్‌ మూవీని గుర్తు చేశాడు. ప్రస్తుతం ఈ ప్రొమో సాంగ్‌ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇక ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యాక ఏ రేంజ్‌లో మారుమోగుతుందో చూడాలి. కాగా సామజవరగమన మూవీకి రైటర్‌గా పనిచేసిన భాను బోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మే 9న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Tu Mera Lover Song Promo | Mass Jathara |Ravi Teja, Sreeleela |Bheems | Bhanu Bogavarapu |Naga Vamsi

Exit mobile version
Skip to toolbar