Site icon Prime9

Ram Charan Reunit to Kutti: రామ్‌ చరణ్‌ ఇంటికి తిరిగొచ్చిన ‘కుట్టి’.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

Ram Charan Reunit with Kutti: హీరో రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన తమ కుట్టి తప్పిపోయిందని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. వారు పెంచుకుంటున్న ఆఫ్రికన్‌ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైనా కనిపిస్తే చెప్పడంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. జుబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 25లో ఆఫ్రికన్‌ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైన కనిపిస్తే చెప్పండంటూ చిలుక ఫోటో షేర్‌ చేస్తూ రిక్వెస్ట్‌ చేసింది. అయితే ఇప్పుడు ఆ చిలుక తిరిగి వారి చెంతకు చేరుకుంది. ఆమె పోస్ట్‌ చూసిన ఓ యానిమల్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు చిలుకను వెతికి తిరిగి చరణ్‌ దంపతులకు అప్పగించారు. తిరిగి కుట్టి ఇంటికి చేరడంతో చరణ్‌, ఉపాసనలు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు.

కాగా రామ్ చరణ్, ఉపాసనలు జంతు ప్రేమికులు అనే విషయం తెలిసిందే. ఇంట్లో రకరకాల పక్షులు, జంతువులను పెంచుకుంటున్నారు. వారికి రైమ్‌ అనే పెట్‌ డాగ్‌తో పాటు గుర్రాలు ఉన్నాయి. అలాగే ఆఫ్రికన్ జాతికి చెందిన చిలుకను పెంచుకుంటున్నారు. దానికి కుట్టి అని పేరు పెట్టారు. అయితే వారం క్రితం తప్పిపోయిన కుట్టిని ఓ యువతి కంటపడిందంటూ ఎనిమిల్‌ కన్జర్వేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సదరు సంస్థ ఆ పక్షి వివరాలను తమ గ్రూపులో పోస్ట్‌ చేశారు. చివరకు ఇది రామ్‌ చరణ్‌ ఇంటి నుంచి తప్పిపోయిన పక్షిగా గుర్తించి వారి చెంతకు చేర్చారు.

 

Exit mobile version
Skip to toolbar