Prime9

Coolie Telugu Trailer: రజనీకాంత్‌ కూలీ ట్రైలర్‌ – గూస్‌బంప్స్‌ తెప్పించేలా నాగార్జున డైలాగ్స్‌

Rajinikanth Coolie Telugu Trailer Out: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. జైలర్‌ సూపర్‌ హిట్‌ కొట్టిన రజనీ పుల్‌ జోరుమీద ఉన్నారు. ఆయన 171వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఖైదీ, విక్రమ్‌, లియో వంటి వరుస హిట్స్‌ అందుకున్న లోకేష్‌ కనగరాజ్‌ రజనీ సినిమా అనగానే మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

 

పైగా ఇందులో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున అతిథి పాత్రలో కనిపించనున్నారు. రియల్‌ స్టార్‌ ఉపేంద్ర సైతం ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో కూలీ మూవీపై మరింత బజ్‌ నెలకొంది. దీంతో ఈ మూవీకి సంబంధించి ఎలాంటి చిన్న అప్‌డేట్‌ వచ్చినా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆగష్టు 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. మూవీ ఇంకా మూడు నెలల టైం ఉంది. అప్పుడే మూవీ టీం ట్రైలర్‌ పేరుతో ఓ స్పెషల్‌ ఆడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో రజనీకాంత్ లుక్‌, నాగార్జున విజిల్‌ వేస్తున్న సన్నివేశాలను చూపించారు.

 

మన తాతలు ముత్తాలు వచ్చారు పోయార.. అనే రజనీ డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ మొదలైంది. ఇందులో రజనీ పూర్తి లుక్‌ రివీల్‌ చేయకుండ సస్పెన్స్‌ ఇచ్చింది. అనంతరం ఈ మాఫియాకు గ్రామర్‌ నేర్పింది నేనే.. రహమత్‌ తెచ్చింది నేనే అనే నాగార్జున డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. “నేను చంపాలనుకుంటే చేతిలో వెపన్స్‌ అవసరం లేదు.. ఎదురుగా ఎనిమి ఉంటే చాలు” నాగ్‌ డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ముగుస్తుంది. ఇందులో ఉపేద్ర లుక్‌ కూడా రివీల్‌ చేసి క్యూరియాసిటి పెంచారు. ప్రస్తుతం కూలీ ఈ ఆడియో ట్రైలర్‌ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం దీనికి యూట్యూబ్‌ మంచి రెస్పాన్స్‌ వస్తుంది. విడుదలైన గంటల్లోనే ఈ మూవీ మిలియన్‌పైగా వ్యూస్‌ సాధించి దూసుకపోతుంది.

Coolie Telugu Trailer | Rajinikanth x Lokesh Kanagaraj | Thalaivar 171 | Nagarjuna Simon | FAN-MADE

Exit mobile version
Skip to toolbar