Producer SKN Video: ‘బేబీ’ మూవీ నిర్మాత ఎస్‌కేఎన్ తన వ్యాఖ్యలపై స్పందించాడు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు హీరోయిన్లను ఉద్దేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలతో వర్క్ చేస్తే ఎలా ఉంటుందనేది తెలిసిందని, అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని తాను, డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నామంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. తెలుగు అమ్మాయిలను ఉద్దేశించి ఇలా అనడం కరెక్ట్ కాదనీ, ఆయన వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అన్నాడంటూ చర్చ నడుస్తోంది.
దీనిపై నెటిజన్స్ భిన్నాప్రాయాలు వెల్లడిస్తూ నిర్మాత ఎస్‌కేఎన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్మాత ఎస్‌కేఎన్ నేరుగా స్పందించాడు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఇండస్ట్రీకి ఎంతోమంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేసిన కొందిమంది నిర్మాతల్లో తాను ఒకడిని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తాను చేసిన కామెంట్స్‌ని తప్పుగా అర్ధం చేసుకున్నారని, ఇప్పటికే ఎనిమిది మంది తెలుగు అమ్మాయిలను వెండితెరకు పరిచయం చేశానని చెప్పాడు.
భవిష్యత్తులో మరో 25 మంది ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నట్టు చెప్పాడు. ఓ తెలుగు జర్నలిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చిన తనకు తెలుగు వారి ప్రతిభను ప్రోత్సహించడం ఎల్లప్పుడూ తన ప్రాదాన్యతగా భావిస్తాననని చెప్పుకోచ్చాడు. అందుకే దయ చేసిన తనపై ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు.
Hi everyone, Namaste. I am one of the few producers who have introduced Many Telugu actresses to the industry. A lighthearted comment I made recently was misunderstood, leading to unnecessary headlines with incorrect meanings.
To clarify, I have introduced 8 talented individuals… pic.twitter.com/raWN8Suvpk
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 18, 2025