Site icon Prime9

Priyadarshi: గేమ్ ఛేంజర్.. 25 రోజులు డేట్స్ తీసుకొని.. రెండు నిమిషాలు కూడా లేకుండా..

Priyadarshi: నటుడు ప్రియదర్శి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు సినిమాలో కౌశిక్ అనే పాత్రతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారాడు. ఆ తరువాత మల్లేశం అనే సినిమాతో హీరోగా మారి.. ఒకపక్క కమెడియన్ గా ఇంకోపక్క హీరోగా నటిస్తూ ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

 

ఇక బలగం సినిమాతో ప్రియదర్శి హీరోగా ఫిక్స్ అయ్యిపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రియదర్శి నటిస్తున్న చిత్రం కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. నాని నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మారినంత హైప్ ను క్రియేట్ చేస్తుంది.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రియదర్శి చరణ్ ఫ్రెండ్ పాత్రలో మెరిశాడు. రా మచ్చ మచ్చ సాంగ్ లో ఒక షాట్ లో.. ఫ్రెండ్స్ తో చరణ్ మాట్లాడుతున్న సమయంలో ఒక షాట్ లో ప్రియదర్శి కనిపిస్తాడు.  అయితే ఈ సినిమా కోసం తాను 25 రోజులు షూట్ చేసే కేవలం రెండు నిముషాలు కూడా లేకుండా కట్ చేశారని చెప్పకురావడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

 

” గేమ్ ఛేంజర్ సినిమా నేను బలగం సినిమా కన్నా ముందే ఒప్పుకున్నాను. అప్పుడు నేను హీరోలకు ఫ్రెండ్ గా నటిస్తున్నాను. గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుందో.. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నా పాత్ర చిన్నది అని నాకు ముందే తెలుసు. తెలిసే నేను ఒప్పుకున్నాను.

 

శంకర్ గారు, రామ్ చరణ్ అన్నా, తిరుగారితో పనిచేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. అందుకే పాత్ర తక్కువున్నా ఒప్పుకున్నా.. ఈ సినిమా కోసం నేను 25 రోజులు షూటింగ్ చేశా.. అందులో చాలా సీన్స్ చేశా.. ఎడిటింగ్ లో వాటిని తీసేశారు. చివరికి నేను రెండు నిమిషాలు కూడా కనిపించలేదు. అయినా నాకు ఆనందంగా ఉంది. శంకర్ గారు.. నాతో సినిమా చేయలేరు కదా. ఇలాగైనా ఆయనతో పనిచేసే అవకాశం దక్కింది. అది చాలు” అంటూ ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ప్రియదర్శి కోర్ట్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version
Skip to toolbar